ఎన్టీఆర్ పై భారీ కుట్ర జరుగుతోంది…

ntr

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ పై భారీ కుట్ర జరుగుతోంది. ఓ బడా హీరోకు చెందిన కొందరు వ్యక్తులు, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ను బద్నామ్ చేయడానికి ప్రయత్నించారు. దీనికోసం బాలయ్య అస్త్రాన్ని వాళ్లు ప్రయోగించారు. ఎన్టీఆర్-బాలయ్యకు మధ్య తెరవెనక కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ వాటిని బయటపెట్టలేదు. కుదిరితే బాబాయ్ తో కలిసిపోదామనే ఎప్పుడూ వెయిటింగ్. ఇలాంటి టైమ్ లో బాలయ్య సినిమాలపై ఎన్టీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని ఎవరు పుట్టించారో తెలీదు కానీ, మరో వర్గం అభిమానులు మాత్రం కావాలనే ఆ వార్తల్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నెట్ లో వచ్చిన వార్తల్ని షేర్ చేస్తూ… తెగ వైరల్ చేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం… బాలయ్యపై ఎన్టీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదట.

ఎన్టీఆర్ ఎటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి వార్తల్ని పుట్టించి హల్ చల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇప్పుడు మరో హిట్ ప్రాజెక్టు కోసం తీవ్రంగా హోంవర్క్ చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ను తప్పుదోవ పట్టించేందుకే, ఓ స్టార్ హీరో అభిమాన వర్గం సోషల్ మీడియాలో ఇలా రచ్చ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గడిచిన 24 గంటలుగా ఈ వార్తల ప్రభావం బాగా తగ్గింది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ ను షేర్ చేయడం, తగ్గించడం లాంటివి బాగా తగ్గాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్టీఆర్ అభిమానులు కామ్ గా ఉండడం కొసమెరుపు. వాళ్లు అలా సైలెంట్ గా ఉండడం వల్లనే ఈ వార్త అబద్ధమని తేలింది.

 

Loading...

Leave a Reply

*