ఎన్టీఆర్‌కి బాల‌య్య డైరెక్ట‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

ntr

తార‌క్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చూపిస్తా.. ఇదీ బాల‌య్య డైరెక్ట‌ర్ ఎన్టీఆర్‌కి చెప్పిన మాట అట‌. ఇంత‌కీ అది ఏ సినిమా అనుకుంటున్నారు..? బాబాయ్ బాల‌య్య సినిమా. అందులోనూ ఆయ‌న న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మూవీ. ఇప్ప‌టికే అర్ధం అయి ఉంటుంది. అది ఏ మూవీనో.. అవును, గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణినే.ఈ సినిమా టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా విడుద‌ల‌యింది. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన తార‌క్‌.. ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఆ పాత్ర బాల‌య్య‌కే సాధ్య‌మ‌ని, శాత‌క‌ర్ణి లుక్‌లో అదిరిపోయాడ‌ని, మ‌రెవ‌రికీ సాధ్యం కాని రీతిలో సినిమా ఉంటుంద‌ని ట్వీట్ చేశాడు. అక్క‌డితే ఆగ‌లేదు. సినిమా డైరెక్ట‌ర్ క్రిష్‌కి ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపాడు. గ్రాఫిక్స్ బావున్నాయ‌ని, యుద్ధ స‌న్నివేశాలు అద్భుతంగా ఉంటాయ‌ని భావిస్తున్నాన‌ని వివ‌రించాడ‌ట‌. సినిమాకు బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పాడ‌ట‌. సీజీ వ‌ర్క్‌తో కూడిన విజువల్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌ని తెలిపాడ‌ట‌.

యంగ్‌టైగ‌ర్ ప్ర‌శంస‌ల‌కు ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన క్రిష్‌.. సినిమా ఎలా చేస్తుందీ వివ‌రించాడ‌ట‌. అంతేకాదు, సినిమా ర‌ష్ ఒక్క‌సారి వ‌చ్చి చూడొచ్చ‌ని తెలిపాడ‌ట‌. ఎప్పుడంటే అప్పుడే శాత‌క‌ర్ణి సినిమా చూపిస్తాన‌న్నాడ‌ట‌. క్రిష్ ఆఫ‌ర్‌కి తార‌క్ థ్యాంక్స్ చెప్పాడ‌ట‌. మ‌రి ఇదే ఊపులో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ మూవీ వ‌స్తే బావుంటుందంటున్నారు నంద‌మూరి అభిమానులు.

Loading...

Leave a Reply

*