మన హీరోల గాలీ తీసిన కోటా…టాలీవుడ్ కుర్ర హీరో వింత వేషాల‌పై పంచ్‌లు..!!

kota-srinivas-rao

టాలీవుడ్‌పై మ‌రో్సారి విరుచుకుప‌డ్డాడు సీనియ‌ర్ కేర‌క్ట‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు. జ‌న‌తా గ్యారేజ్ విడుద‌ల త‌ర్వాత తార‌క్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి, నందమూరి ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గుర‌యిన కోట‌.. తాజాగా మ‌రో బాంబ్ పేల్చాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ప‌రభాషా న‌టుల‌పై విరుచుకుపడుతున్నారు. తెలుగు చిత్ర‌సీమ‌లో వారికి చాన్స్‌లు ఎందుకు ఇస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇటు, భారీ బ‌డ్జెట్‌ల‌తో సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇలా, ఇటీవ‌ల నిత్యం పంచ్‌ల‌తో టాలీవుడ్‌కి కాక పుట్టిస్తున్న కోట‌.. తాజాగా కుర్ర హీరోల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

న‌ట‌న వేరు, డ్యాన్స్‌లు వేరు.. డ్యాన్స్‌లు ఫైట్‌లు వ‌స్తే.. న‌ట‌న వ‌చ్చేసిన‌ట్టు కాదు… అన్నారు. కుర్ర హీరోల‌లో చాలామంది న‌ట‌న కంటే డ్యాన్స్‌ల‌మీదే ఫోక‌స్ పెడుతున్నార‌ని ఆయ‌న ఉద్దేశ్యం. అక్క‌డితో ఆగ‌లేదు. నాటిక అంటే ఇలా ఉండాలి, న‌ట‌న అంటే అలా ఉండాలి.. అని కొన్ని ల‌క్ష‌ణాలుంటాయి. డ్యాన్స్‌ల‌యినా అంతే.. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌.. లాంటి నృత్యాల‌కు కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. కానీ, ఇప్పుడు వ‌స్తున్న సినిమాల‌లోని డ్యాన్స్‌ల‌పై ఓ లుక్కేయండి.. హీరోయిన్ ముందు హీరో గెంతుతూ ఉంటాడు. కింద‌ప‌డి కొట్టుకుంటూ ఉంటాడు.అదే మంటే ఫ్లోర్ డ్యాన్స్ అంటారు. మామూలుగా మ‌న ఇళ్ల‌ల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు అలా గెంతుతారా..? గెంత‌రు క‌దా..? ప‌ద్ద‌తిగా, హుందాగా ఉంటారు. కానీ, సినిమాలలో అలా ఎందుకు ఉంటారో అని ప్ర‌శ్నించారు.

ప‌దుల సంఖ్య‌లో డ్యాన్సర్‌ల‌తో గ్రూప్ డ్యాన్స్‌లు అవ‌స‌ర‌మా అన్నారు కోట‌. ఇటు, శృతిమించుతోన్న మేక‌ప్‌పైనా ఆయ‌న చుర‌క‌లు అంటించారు. ఖైదీ వేషం వేసే న‌టుడికి మేక‌ప్‌తో ప‌నేంని, ఖైదీ అంటే మాసిన‌గ‌డ్డం, మాసిన జుట్టుతో ఉంటాడ‌ని.. దీనికి మేక‌ప్ అవ‌స‌ర‌మా? అని ఎద్దేవా చేశారు. ఇలాంటి చిన్న మేకప్ లకు కూడా ముంబై నుంచి మేకప్ మెన్లను దిగుమతి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసాడు కోటా. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ తనను తీవ్రంగా వేధిస్తోందని , పోనీ ఏమన్నా మంచి మాటలు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
మొత్త‌మ్మీద‌, కోట శ్రీనివాస‌రావు మ‌రోసారి త‌నదైన స్ట‌యిల్‌లో రెచ్చిపోయారు.

Loading...

Leave a Reply

*