కొరటాలకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదట..

koratala

వరుసగా 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. మిర్చితో ఇండస్ట్రీకి సూపర్ హిట్ ఇచ్చాడు. శ్రీమంతుడుతో మహేష్ కెరీర్ లోనే నిలిచిపోయే సినిమా ఇచ్చాడు. తాజాగా జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందించాడు. ఇలా వరుసగా 3 సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు… కచ్చితంగా తన నెక్ట్స్ సినిమాకు కాస్త భారీగానే ఛార్జ్ చేస్తాడు. కొరటాల తన నెక్ట్స్ సినిమాను మహేష్ తో ప్లాన్ చేశాడు. సో… భారీ చెక్ తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ ఈ స్టార్ దర్శకుడు మాత్రం అంతకుమించి కోరుకుంటున్నాడు.

మహేష్ సినిమా కోసం కొరటాల శివ పైసా కూడా తీసుకోవడం లేదు. నిజానికి అతడికి 15కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొరటాల ఆ 15కోట్ల రూపాయల్లో ఒక్క పైసా కూడా ముట్టుకోవడం లేదు. ఎందుకంటే.. కొరటాల ఇప్పుడు అంతకుమించి ఆలోచిస్తున్నాడు. అందుకు తగ్గట్టే ప్లాన్స్ రాసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం… తన నాలుగో సినిమాకు రెమ్యునరేషన్ లో భాగంగా సినిమా రైట్స్ దక్కించుకునే ఆలోచనలో ఉన్నాడట కొరటాల.

నిజానికి మొన్నటివరకు హీరోలు మాత్రమే ఇలా చేసేవారు. చిరంజీవి అప్పట్లో రెమ్యూనరేషన్ కింద నైజాం రైట్స్ తీసుకోనేవారు. మహేష్, పవన్ కూడా అప్పుడప్పుడు ఇదే పనిచేశారు. ఫస్ట్ టైం, ఇప్పుడు కొరటాల కూడా హీరోల రేంజ్ లో రైట్స్ తీసుకోవాలనుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మహేష్ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ను కొరటాలకు ఇచ్చే స్కెచ్ రెడీ అవుతోంది. అదే కనుక జరిగితే కొరటాల పారితోషికం 17-20 కోట్ల రూపాయల మధ్య ఫిక్స్ అవుతుంది. అదీ కొరటాల స్కెచ్ అంటే.

Loading...

Leave a Reply

*