నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న కొర‌టాల‌..!

koratala-siva

అవును, కొర‌టాల ఈ రేంజ్‌లో రెమ్యూన‌రేష‌న్ కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. ఆయ‌న డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సంచ‌ల‌న విజయాలు న‌మోదు చేస్తున్న కొర‌టాల‌కి టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. వ‌ర‌స‌గా విజ‌యాలు సాధించ‌డం వేరు. ఇండ‌స్ట్రీ హిట్‌లు, భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌లు కొట్టడం మ‌రో ప‌ద్ద‌తి. కొర‌టాల సెకండ్ కేట‌గిరి. మిర్చితో ప్ర‌భాస్‌ని 40 కోట్ల క్ల‌బ్‌లో ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. శ్రీమంతుడుతో టాలీవుడ్ ఆల్‌టైమ్ టాప్ 2గా నిల‌బెట్టాడు. ఇక‌, తాజాగా జ‌న‌తా గ్యారేజ్‌. తార‌క్ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద స‌క్సెస్ అంతేకాదు.. టాలీవుడ్ ఆల్‌టైమ్ థ‌ర్డ్ బిగ్గెస్ట్‌ని డెలివ‌ర్ చేశాడు. దీంతో, కొర‌టాల రేంజ్ బాగా పెరిగింది.

కొర‌టాల‌కి ప్ర‌స్తుతం ఎంత డిమాండ్ చేసినా ఇవ్వ‌డానికి నిర్మాతలు రెడీ. కానీ ఏకంగా 16 కోట్లంటే అది సాధారణ విషయం కాదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఆ రేంజ్ పారితోషికం అందుకుంటున్న హీరోలు ముగ్గురే. ఒక‌టి పవ‌న్‌, రెండు మ‌హేష్‌.. మూడు తార‌క్‌.. అయితే, తార‌క్‌కి కూడా అంత ఇవ్వ‌డానికి నిర్మాతలు రెడీగా లేరు. ఆ ఫిగ‌ర్‌కి కాస్త అటో ఇటో అయితే ఓకే. ఇక‌, ద‌ర్శ‌కుల లిస్ట్‌లో ఒక్క రాజ‌మౌళి మిన‌హా.. మ‌రే డైరెక్ట‌ర్‌కి ఆ స్థాయిలో పారితోషికం ముట్ట‌జెప్ప‌డం లేదు. బాహుబ‌లితో  జ‌క్క‌న్న సుమారు 70-100 కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నాడ‌న్న మాట వినిపిస్తోంది.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. కొర‌టాల డిమాండ్ చేస్తున్న పారితోషికం ఫిగ‌ర్ చూసి నిర్మాత‌ల‌కు  చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌. ఆయ‌న‌కి ఆ రేంజ్‌లో రెమ్యూన‌రేష‌న్ ఇచ్చినా.. ఎంత మిగులుతుందో తెలియ‌క తిక‌మ‌క‌పడుతున్నార‌ట‌. ట్రాక్ రికార్డ్ చూస్తే సూప‌ర్‌. రాజ‌మౌళి త‌ర్వాత వ‌ర‌స బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఇలా చూస్తే ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. కానీ, ఆ రేంజ్‌లో ఆయ‌న‌కే పారితోషికం ఇస్తే.. ఇక స్టార్ హీరో అయితే సంగ‌తేంటి..? ఇదే ప్ర‌శ్న వారిని వేధిస్తోంద‌ట‌. దీంతో, జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత  కొర‌టాల కొండెక్కి కూర్చున్నాడ‌ని వాపోతున్నార‌ట ప‌లువురు నిర్మాత‌లు. అటు, సినిమా చెయ్యాల‌ని ఉన్నా.. 16 కోట్లు అంటే భ‌య‌ప‌డి వెన‌క్కి వెళుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న మ‌హేష్ సినిమాకి క‌మిట‌య్యాడు. దీనికి ముందే కమిట్  అయ్యాడు. మ‌రి, ఆయ‌న‌కు ఆ రేంజ్‌లో గిట్టుబాటు అవుతుందో కాదో చూడాలి.

 

Loading...

Leave a Reply

*