బాల‌య్య‌-మ‌హేష్ కాంబినేష‌న్‌లో కొర‌టాల శివ మూవీ..!

siva

మ‌రో జ‌న‌తా గ్యారేజ్‌కి కొర‌టాల శివ సిద్ధ‌మ‌వుతున్నాడా..? జ‌న‌తా గ్యారేజ్‌లో తార‌క్‌-మోహ‌న్‌లాల్ కాంబోతో మేజిక్ చేశాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. టాలీవుడ్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో టాప్ 3గా నిల‌బెట్టాడు ఆ చిత్రాన్ని. ఈ సినిమాలో హీరోయిన్‌ల‌కు రోల్ చాలా త‌క్కువ‌. కేవ‌లం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌-మ‌ల‌యాళీ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కాంబినేష‌న్‌తోనే ఆయ‌న మేజిక్ చేశాడు. సినిమాని స‌క్సెస్ చేశాడు.మ‌రోసారి అలాంటి క‌థ‌నే చేస్తున్నాడ‌ట కొర‌టాల శివ‌. మ‌హేష్‌తో చెయ్య‌బోయే సినిమాలో ఆయ‌న‌తోపాటు మ‌రో బ‌డా హీరోకి కూడా చాన్స్ ఉంద‌ని చెప్పుకుంటున్నారు సినీ జ‌నాలు. ఇది మ‌ల్టీస్టార‌ర్‌లాంటి మూవీ అని..

హీరో రోల్‌తోపాటు మ‌రో సీనియ‌ర్ క‌థానాయకుడికి కూడా ఆ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ రోల్ ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.ప్ర‌స్తుతం కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం.. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో బాల‌య్య బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్‌పై బాల‌య్య‌ను క‌లిసిన కొర‌టాల త‌న క‌థ‌ను వినిపించాడ‌ట‌. ఆయ‌న పాజిటివ్‌గానే స్పందించాడ‌ట‌. ఇటు, మ‌హేష్‌కి కూడా ఆ విషయం చేర‌వేశాడ‌ట‌. ఆయ‌న సూచ‌న మేర‌కే బాల‌య్య‌ను క‌లిశాడ‌ట కొర‌టాల‌. ఇలా, ఇద్ద‌రు బ‌డా హీరోలు దాదాపు అన‌డంతో కొర‌టాల ఫుల్ ఖుషీగా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మహేష్‌-బాల‌య్య ప్ర‌స్తుతం న‌టిస్తున్న వారి వారి సినిమాలు పూర్తయిన వెంట‌నే.. దీనిని సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట కొర‌టాల‌.

జ‌న‌తా గ్యారేజ్ సినిమాలోని మోహ‌న్‌లాల్ రోల్‌లో బాల‌య్య అయితే మూవీ రేంజ్ మ‌రింత పెరిగేదే అనే కామెంట్స్ వినిపించాయి. ఇదే విష‌యం కొర‌టాల ద‌గ్గ‌ర ప్రస్తావిస్తే.. ఈ మూవీలో మోహ‌న్‌లాల్‌ది సాఫ్ట్ రోల్ అని, అలాంటి పాత్ర బాల‌య్య‌కు సెట్ అవ‌ద‌ని వివరించాడు. బాల‌య్య‌-తార‌క్ న‌టించాలంటే అంత‌కంటే ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ ఉండాల‌ని తెలిపాడు. స‌రిగ్గా ఇలాంటి క‌థే తాజాగా సెట్ అయింద‌ట‌. దీంతో, మ‌హేష్-బాల‌య్య‌తో అయితే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావించిన కొర‌టాల‌.. ఆ ఇద్ద‌రితోనూ ఓకే అనిపించుకున్నాడ‌నే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి, ఇది ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*