మహేష్ కోసం జనతా గ్యారేజ్ ఫార్ములా…

mahesh-babu

జనతా గ్యారేజ్ కిక్ దర్శకుడు కొరటాల శివకు బాగానే ఎక్కినట్టుంది. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్ని దేనికదే విభిన్నంగా ప్లాన్ చేసిన కొరటాల, మహేష్ మూవీ కోసం మాత్రం జనతా గ్యారేజ్ ఫార్ములానే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడట. అలా చేసినప్పుడు మాత్రమే సేఫ్ గేమ్ ఆడొచ్చని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఈ మేరకు మహేష్ కు కూడా సమాచారం అందించాడట. ఇంతకీ కొరటాల ఫాలో అవుతున్న జనతా గ్యారేజ్ ఫార్ములా ఏంటో తెలుసా…

జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ లాంటి బిగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. సినిమాకు అది చాలా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్-మోహన్ లాల్ అచ్చంగా తండ్రికొడుకుల్లానే కనిపించారు. అలాంటి మేజిక్ ను మహేష్ కోసం కూడా సృష్టించాలనుకుంటున్నాడు కొరటాల. మహేష్ సినిమాకు కూడా ఓ బడా స్టార్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. అది కూడా ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ఒకర్ని సెలక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఒకటి సృష్టించాడని తెలుస్తోంది.

ఈ పాత్రను బాలయ్య, వెంకటేశ్, నాగార్జునకు వినిపించాలని కొరటాల భావిస్తున్నాడు. వీళ్లలో ఎవరు ఒప్పుకున్నా… అది టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుంది. అయితే ఈ లిస్ట్ లోకి చిరంజీవిని మాత్రం చేర్చలేదు కొరటాల. ఎందుకంటే… సోలో హీరోగానే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి, అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ లోకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో లేడు.

Loading...

Leave a Reply

*