కొరటాల కోటి రూపాయలు ఇచ్చి ఆ కథ కొనుక్కున్నాడట…

untitled-6

మహేష్ తో సినిమాకు ఇటీవలే కొబ్బరికాయ కొట్టాడు కొరటాల. ఆ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాదు.. భరత్ అను నేను అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా…. ఇప్పుడు ఆ స్టోరీలైన్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. నిజానికి ఆ కథ కొరటాలదే కాదంటున్నారు.

ఓ ఔత్సాహిక రచయిత కొరటాల వద్దకొచ్చిఈ కథ వినిపించాడట. ఆ కథ విని కొరటాలకు దిమ్మతిరిగిందట. అలాంటి ఆలోచన తనకు ఎందుకు రాలేదని తెగ బాధపడ్డాడట. వెంటనే సదరు రచయితకు కోటి రూపాయల చెక్ ఇచ్చి కథను రిజర్వ్ చేసుకున్నాడట. ఆ కథతోనే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడట.

గతంలో ఇలాంటి కథల విషయంలోనే కొరటాల శివ, బోయపాటి శ్రీను మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సింహా కథ తనదే అంటూ సంచలన ప్రకటన చేశాడు కొరటాల. దానికి బోయపాటి కూడా రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈసారి అలాంటి వివాదాలు రాకుండా ముందుగానే సదరు రచయితను కోటి రూపాయలతో కామ్ చేశాడట కొరటాల.

Loading...

Leave a Reply

*