పవన్ సినిమా ఉత్తిదే….

pawan-1

2 రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడిచింది. పవన్-కొరటాల కలిసి సినిమా చేస్తే బాగుంటుందని చాలామంది భావించారు. ఇద్దరికీ సామాజిక స్పృహ ఉంది కాబట్టి… అలాంటి కాన్సెప్ట్ తో ఓ సినిమా వస్తే కచ్చితంగా హిట్ అవుతుందని చాలామంది గెస్ చేశారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి, పవన్ కోసం కొరటాల దగ్గర సిద్ధంగా ఓ స్టోరీలైన్ ఉందని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఫైనల్ గా అలాంటివేం లేవని తేల్చేశాడు కొరటాల. తన ఫోకస్ మొత్తం మహేష్ సినిమాపైనే ఉందని చెప్పాడు.

నిజానికి పవన్-కొరటాల కలిసి సినిమా చేద్దామన్నా కూడా అది జరిగే పని కాదు. ఎందుకంటే… ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో నటిస్తున్న పవన్… తర్వాత త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. ఆ తర్వాత ఎఎమ్ రత్నం బ్యానర్ పై.. ఓ తమిళ దర్శకుడితో కలిసి ఇంకో సినిమా చేయబోతున్నాడు. ఇవన్నీ జరగాలంటే కనీసం ఇంకో రెండేళ్లయినా పడుతుంది. ఇటు కొరటాలకు కూడా డిమాండ్ బాగానే ఉంది కాబట్టి.. పవన్ తో సినిమా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.

తాజా సమాచారం ప్రకారం… పవన్ కు బాగా దగ్గరైన ఇద్దరు-ముగ్గురు నిర్మాతలు.. కొరటాలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కుదిరితే పవన్ తో సినిమా చేయాలని సూచించారట. అయితే స్టార్ డైరక్టర్ల వెంట పడి అప్పటికప్పుడు ఏదో ఒక సినిమా చేసేయడం పవన్ జాతకంలోనే లేదు. కథ నచ్చితే ఊహించని దర్శకులకు కూడా పవన్ అవకాశాలిచ్చిన సందర్భాలున్నాయి. సో.. పవన్-కొరటాల కాంబో ఇప్పట్లో లేనట్టే.

Loading...

Leave a Reply

*