ద‌ర్శ‌కుడి లైంగిక‌ వేధింపులు.. హీరోయిన్ ఆత్మ‌హ‌త్య‌..!

linja

దారుణం.. మోసం.. ప‌చ్చి ద‌గా.. ఓ ద‌ర్శ‌కుడే.. ఓ న‌టిపై లైంగిక వేధింపులు.. స‌మాజం ఇంత ఎదిగినా, టెక్నాల‌జీ ఇంత అభివృద్ధి చెందినా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు ఏమాత్రం ఆగ‌డం లేదు. అవి నేటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మొన్నామ‌ధ్య ఓ హీరో.. త‌న‌ను గ‌దిలోకి ర‌మ్మన్నాడంటూ రాధికా ఆప్టే చేసిన ఆరోప‌ణ‌లు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో తెలిసిందే. తాజాగా ఓ త‌మిళ్ ద‌ర్శ‌కుడు ఓ యువ న‌టిని లైంగికంగా వేధించ‌డం ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బిగ్ షాక్‌. ఆ డైరెక్ట‌ర్ వేధింపులు తాళ‌లేక ఆమె ఏకంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డడం విశేషం.

మ‌ల‌యాళంలో సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ అయిన అదితి అలియాస్ అధిరా సంతోష్‌.. త‌మిళ్‌లో తెరంగేట్రం చేసింది. నెదున‌ల్వాడై మూవీతో కోలీవుడ్‌లోనూ ల‌క్ టెస్ట్ చేసుకుంటోంది. ఆ మూవీ డైరెక్ట‌ర్ సెల్వ క‌న్న‌న్‌.. అదితిని లైంగికంగా వేధించాడ‌ట‌. శారీర‌కంగా, మాన‌సికంగా ఆమెను తీవ్రంగా వేధించాడ‌ని ఆమె ఆరోపించింది. వారం క్రితం ఈ వేధింపులు తాళ‌లేక ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అదితి సూసైడ్ చేసుకోవ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసుల‌కు షాకింగ్ వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. ద‌ర్శ‌కుడు సెల్వ‌క‌న్న‌న్ చేసిన అరాచ‌కాల‌ను ఆమె పోలీసుల‌కు వివరించింద‌ట‌. ప్రేమిస్తున్నాడంటూ వెంట‌ప‌డ‌డమే కాదు.. నిరాక‌రిస్తే ఎంత‌కయినా తెగిస్తాన‌ని బెదిరించే వాడ‌ట‌. అయితే, సెల్వ‌క‌న్న‌న్ అంటే ఇష్టం లేని అదితి.. ఆయ‌న‌కు అదే విష‌యం చెప్ప‌గా.. అప్ప‌టినుంచి వేధింపులు మ‌రింత పెరిగాయ‌ని వివ‌రించింది. త‌న‌ను గ‌దిలో వేసి నిర్బంధించాడ‌ని కూడా పోలీసుల‌కు తెలిపింది అదితి.

త‌ప్పించుకొని కేర‌ళ వ‌చ్చాక‌.. న‌డిగ‌ర్ సంఘంతోపాటు ఇత‌రుల‌కు కూడా ఫిర్యాదు చేసినా లైట్ తీసుకున్నార‌ట‌. తాను నడిగర్ సంఘంలో సభ్యురాలిని కానందువల్ల తన ఫిర్యాదు తీసుకోబోమని నడిగర్ సంఘం చెప్పినట్టు అదితి వివరించింది. అయితే, విష‌యం స‌మ‌సిపోయింద‌నుకున్న త‌ర్వాత ఆమె ఇటీవ‌ల ఓ యాడ్ షూటింగ్ కోసం కేర‌ళ నుంచి చెన్నై వ‌చ్చి అక్క‌డ షూటింగ్ చేస్తుండ‌గా, సెల్వ‌క‌న్న‌న్ అక్క‌డికి వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేశాడ‌ట‌. అంద‌రిలో త‌న‌ను దారుణంగా హింసించాడ‌ని, త‌ల‌ను గోడ‌కేసి బాది చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడ‌ని, పెళ్లి చేసుకోక‌పోతే.. చంపేస్తాన‌ని బెదిరించాడ‌ట‌. దీంతో, చేసేదేమీ లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాన‌ని వెల్ల‌డించింది అదితి. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు షురూ చేశారు.

Loading...

Leave a Reply

*