మందు కంటే ముద్దు డేంజ‌ర్‌

kiss

ముద్దిమ్మంది ఓ పూబంతి…. మ‌న‌సిమ్మంది ఓ చామంతి… అంటే ఎగురుకుంటూ వెళ్లి పెద‌వి పెద‌వి క‌లిపి ముద్దులు ఇచ్చేయ‌కండి… కిస్సంటే నే ప‌డిచ‌స్తా… అది కిస్‌మిస్‌లా ఉంటుంది అని ఎగురుకుంటూ వెళ్ల‌బాకండి… అధర అమృతంలో హాలాహ‌లం ఉంటుంద‌ట‌… ముద్దు మాటున ప్ర‌మాదం పొంచి ఉందిట‌… కిస్ చేస్తే లైఫ్ మిస్ అయిపోతారు… బ‌తుకు కిస్‌కింధ‌కాండ అయిపోతుంది…అందుక‌నే ముద్దుముచ్చ‌ట్లు త‌ర్వాత ముందు అస‌లు సంగ‌తి తెలుసుకోండి…మందు కంటే ముద్దు డేంజ‌ర్‌ట‌…… చాలామంది తెగ మందు కొట్టేస్తుంటే మ‌నం బాధ‌ప‌డిపోతుంటాం… వీడు ఎక్కువ‌కాలం ఉండ‌డురా అనుకుంటాం… అయితే మ‌ద్య‌పానం క‌న్నా ముద్దుపానం ఇంకా డేంజ‌ర్‌ట‌…

మందు కంటే ముద్దు డేంజ‌ర్ అని శాస్త్రీయ అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.. మందు తాగితే లివ‌ర్ దెబ్బ‌తింటుంది అంతే… అయితే రోజూ క‌స్సుక‌స్సుమంటూ కిస్సులు పెట్టుకుంటే లైఫే గ‌ల్లంత‌వుతుందిట‌… తీపి ముద్దు ఇప్పుడు చేదు అంటున్నారు ప‌రిశోధ‌కులు… ఫ్రెంచ్ కిస్‌తో చాలా డేంజ‌ర్‌ట‌… కొస‌రి కొస‌రి ఫ్రెంచి ముద్దులు పెట్టుకుంటే హ్యుమ‌న్ పాపిలోమా వైర‌స్‌….హెచ్‌పీవీ అనే వ్యాధి త్వ‌ర‌గా వ్యాప్తి చెందుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతు న్నాయి..ఈ హెచ్‌పీవీ వైర‌స్ త్వ‌ర‌గా వ్యాపించ‌డం వ‌ల్ల మ‌నుషుల‌కు త‌ల‌, మెడ కేన్స‌ర్‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు..

ఫ్రెంచ్ కిస్ వ‌ల్ల ఈ వైర‌స్ త్వ‌రగా యాక్టివేట్ అవుతుంద‌ని త‌ద్వారా త‌ల‌, మెడ కేన్స‌ర్‌లు వ‌చ్చే అవ‌కాశం 250 రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు…. అది ఆడ‌, మ‌గ ఇద్ద‌రిలో వ‌స్తుందిట‌… సో నీ అధ‌రామృతం పుల్లారెడ్డి అని ఎగ‌బ‌డి ముద్దులు పెట్టుకుంటూ పోతే చివ‌ర‌కు మీకు క‌డ్డీ మిగులుతుంది. జీవితం దీపంబుడ్డిలా ఆరిపోతుంది. క‌నుక ముద్దుల మొగుడిలా కాకుండా మొద్దు స్వ‌రూపంలా ఉండ‌డ‌మే మంచిది.

Loading...

Leave a Reply

*