చిరంజీవి కంటే ముందే….

chiru

సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య పోటీపడబోతున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరివీ ప్రతిష్టాత్మక సినిమాలే. ఇద్దరూ హేమాహేమీలే. రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. పైగా రెండూ సంక్రాంతికే వస్తున్నాయి. సో.. ఈసారి సంక్రాంతి పోటీ రంజుగా సాగబోతోందంటూ ఇప్పటికే బెట్టింగ్ లు షురూ అయ్యాయి. అయితే రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉండనే ఉంది.

బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిని, సంక్రాంతి కానుకగా సంక్రాంతి రోజున విడుదల చేయాలని మొదట  అనుకున్నారు. అంటే జనవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నమాట. అటు చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ 150వ సినిమా ఖైదీ నంబర్-150 ని భోగీకి విడుదల చేయాలని అనుకున్నారు. అంటే శాతకర్ణి విడుదలకు ఒక రోజు ముందు ఖైదీ రాబోతోంది. అలా ఒకరోజు తేడాలో రెండు సినిమాలు పోటీపడబోతున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం… చిరంజీవి సినిమా కంటే ముందే బాలయ్య సినిమా బరిలో దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను జనవరి 12నే విడుదల చేయాలని అనుకుంటున్నారట. బాలయ్య జాతకం ప్రకారం ఆరోజున విడుదల చేస్తే సినిమా సూపర్ హిట్ అట. అందుకే ఖైేదీ నంబర్-150 కంటే ఒక రోజు ముందే శాతకర్ణి థియేటర్లలోకి రానుందని టాక్.

Loading...

Leave a Reply

*