ఇకపై రియల్ లైఫ్ లోకి బాహుబలి పాత్రలు….

bahubhali

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రను ఎవరైనా మరిచిపోగలరా… సినిమాలో బాహుబలి పాత్రలో కనిపించిన ప్రభాస్ రాజసాన్ని మరిచిపోగలరా… ఇక తమన్న అందాలు, వయ్యారాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో గుర్తున్నాయి కదా… వెండితెరపై ఓ వెలుగువెలిగిన ఈ పాత్రలన్నీ త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. అచ్చం బాహుబలిలో ఎలాంటి డ్రెస్ వేసుకొని తమన్న హొయలు పోయిందో.. అదే గెటప్ తో మీడియా మందుకు రానుంది. భళ్లాలదేవ పాత్రతో రానా జనాల మధ్యకు రాబోతున్నాడు. కత్తి పట్టుకొని కట్టప్ప కెమెరా ముందు ప్రత్యక్షం కాబోతున్నాడు.

అవును.. బాహుబలి-2 సినిమా కోసం రాజమౌళి వేసిన ప్లాన్ ఇది. ఈ సినిమా ప్రమోషన్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన రాజమౌళి… సినిమాలో పాత్రల్నే నేరుగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట. అంటే… భళ్లాలదేవ గెటప్ లోనే రానా ప్రెస్ మీట్ కు వస్తాడన్నమాట. కుదిరితే ఆ మేనరిజమ్ తోనే మాట్లాడతాడు. అటు తమన్న కూడా సినిమాలో తన గెటప్ తోనే ప్రెస్ మీట్ కు హాజరవుతుంది. ఇలా యూనిట్ లో కీలకమైన పాత్రలన్నీ… రియల్ లైఫ్ లోకి రాబోతున్నాయన్నమాట.

ఈ ప్రచారాన్ని సౌత్ కే పరిమితం చేయాలనుకుంటున్నాడట రాజమౌళి. బాహుబలి-2 సినిమాతో వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టాలనేది యూనిట్ టార్గెట్. అందుకు తగ్గట్టే వినూత్నంగా సినిమాకు ప్రచారం కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఇలా వెెండితెర పాత్రల్ని జనాల ముందుకు తీసుకొచ్చే భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట రాజమౌళి.

Loading...

Leave a Reply

*