ఈసారి తెర చిరిగిపోవడం ఖాయం…

aish

ఈమధ్యే వచ్చిన ఏ దిల్ హే ముష్కిల్ సినిమాలో ఐష్ చేసిన హంగామా అందరం చూశాం. అప్పటికే సెన్సారోళ్లు కొన్ని సీన్లు తొలిగించినప్పటికీ.. ఉన్న సీన్లతోనే ప్రేక్షకులు పండగ చేసుకున్నారు. ఐష్ లో వేడి-వాడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా అది. ఎట్టకేలకు ఐష్ ను ఎరోటిక్ గా చూసిన ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. కేవలం ఒక్క ఐష్ మాత్రమే తెరపై అలా కనిపిస్తే ఏం బాగుంటుందని అనిపించింది ఓ స్టార్ నిర్మాతకు. అందుకే ఈసారి ఐష్ తో పాటు కత్రినాను కూడా రంగంలోకి దించుతున్నాడు.

అవును.. త్వరలోనే ఐశ్వర్యరాయ్, కత్రినాకైఫ్ హీరోయిన్లుగా సినిమా రాబోతోందట. ఐష్ తో ఏ దిల్ హే ముష్కిల్ సినిమాను నిర్మించిన దర్శక-నిర్మాత కరణ్ జోహారే… ఈ నయా మూవీని కూడా నిర్మిస్తాడట. మెగా పోన్ మాత్రం వేరే వాళ్లకు అప్పగిస్తాడట. అయితే అన్నింటికంటే పిచ్చెక్కిపోయే న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ఐష్, కత్రినా ఇద్దరూ బికినీల్లో కనిపిస్తారట.

అసలే ఐష్ అందాలు, తేనెకళ్ల చూపులతో సగం చచ్చిపోయాడు ప్రేక్షకుడు. ఇప్పుడు ఆ వేడిని కత్రినాకైఫ్ రెట్టింపు చేయబోతోంది. పైగా ఈసారి బికినీ పండగ అట. రణబీర్ తో క్లోజ్ గా నటిస్తేనే బిగ్ బి ఫ్యామిలీ వణికిపోయింది. ఇప్పుడు కొత్త సినిమాలో ఏకంగా బికినీ అంటున్నారు. ఈసారి బిగ్ బి, స్మాల్ బిలు ఏం చేస్తారో చూడాలి.

Loading...

Leave a Reply

*