పవన్ కు లెక్క సరిపోలేదా.. ఇంకా తిక్క కావాలా…

pawan

పవన్ సినిమాలోనిదే ఈ సూపర్ హిట్ డైలాగ్. తనకో కాస్త తిక్క ఉందని,కానీ ఆ తిక్కకు కూడా ఓ లెక్క ఉందని పవన్ గర్వంగా చెబుతాడు. అలా చెప్పిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ అదే డైలాగ్ ను కొనసాగిస్తూ తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం ఫెయిలైంది. అది కూడా అలాంటిలాంటి ఫ్లాప్ కాదు. ఒక విధంగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ కు పవన్ ఫ్యాన్స్ చెప్పే లాజిక్ మాత్రం వేరేలా ఉంటుంది. ఉగాదికి విడుదల చేయడం వల్లనే సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిలైందంటున్నారు ఫ్యాన్స్.

అలాంటి టాక్ ఉన్నప్పటికీ.. పవన్ తన కొత్త సినిమాను మరోసారి ఉగాదికే సిద్ధంచేస్తున్నాడట. దీంతో అంతా షాక్ అయ్యారు. ఈసారి పవన్ లెక్కేంటో… అతడి తిక్కకు అర్థమేంటో అర్థంకాక తలపట్టుకున్నారు. అవువు.. ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమాను ఉగాది కానుకగా వచ్చే ఏడాది మార్చి 29న విడుదల చేయాలని అనుకుంటున్నాడట పవన్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఈ ఏడాది ఉగాది కానుకగా వచ్చి ఫ్లాప్ అయింది.

వచ్చే ఏడాది ఉగాది కానుకగా కాటమరాయుడు వస్తోంది. ఈ రెండు సినిమాల్లో హీరో ఒకడే. నిర్మాత కూడా సేమ్.ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ అంతా కలిసి పవన్ కు సమాచారం అందిస్తూనే ఉన్నారు. దయచేసి ఉగాది నుంచి తప్పుకోమని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. మరి ఈ రికమండేషన్స్ ను పవన్ పట్టించుకుంటాడా.. లేక మరోసారి తన తిక్క ప్రకారం దూసుకుపోతాడా అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*