హీరోగారి మీసం ఊడిపోయింది..!

karthi

టాలీవుడ్‌లోనే కాదు.. ఏ వుడ్‌లో అయినా చాలా మంది హీరోలు త‌మ గ్లామ‌ర్‌ని పెంచుకోవ‌డం కోసం.. విగ్గులు పెట్టుకుంటారు. త‌మ అభిమానుల‌కు రియ‌ల్ ఫేస్‌ని క‌నిపించ‌కుండా.. గ్లామ‌ర‌స్‌గా, హ్యాండ్స‌మ్‌గా క‌నిపించేందుకు ట్రై చేస్తారు. అయితే, పెట్టుడు విగ్గులు చూశాం కానీ.. పెట్టుడు మీసాలు చూశారా..?

ఇదిగో పెట్టుడు మీసాలు చూపించాడు రియ‌ల్‌గా హీరో కార్తి. తెర‌పై కేర‌క్ట‌ర్‌ల కోసం హీరోలు, కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌లు పెట్టుడు మీసాలు పెట్టుకొని తిరుగుతారు. ఇది కామ‌న్‌. కానీ, కార్తి రియ‌ల్‌గానే షేవ్ చేసిన త‌న మీసాన్ని క‌వ‌ర్ చేసుకునేందుకు ఓ ప్రెస్‌మీట్‌కి వ‌చ్చాడు. మాట్లాడుతుండ‌గా అది ఊడిపోయింది. అంతే, త‌న మీసాన్ని స‌వ‌రించుకుంటూ ఇలా అడ్డంగా దొరికిపోయాడు. అదీ ఎక్క‌డ‌నుకుంటున్నారు.. హైద‌రాబాద్‌లోనే.

కాష్మోరా సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన కార్తి… మీడియాతో మాట్లాడుతుండ‌గా ఆయ‌న మీసం జారిపోయింది. కార్తి మీసం లేకుండా ఇంత‌వ‌ర‌కు ఏ సినిమాలోనూ న‌టించ‌లేదు. మీసం లుక్ కూడా బాగా ఉండే సౌత్ హీరోల‌లో కార్తి ఒక‌డు. ఆయ‌న బ్ర‌ద‌ర్‌సూర్య మీసంలో క‌నిపించిన సంద‌ర్భాలు వేరు. కానీ, త‌నను మీస‌క‌ట్టులో చూసుకునేందుకు త‌న అభిమానులు ఇష్ట‌ప‌డ‌తార‌ని భావించిన కార్తి.. వెంట‌నే ఇలా ఒక పెట్టుడు మీసం పెట్టుకుని వచ్చాడు. మైకు పట్టుకుని సినిమా గురించి ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. అంతలో ఉన్నట్టుండి ఎడమవైపు మీసం కొంచెం కిందకు జారింది. ఆ విషయం ముందు పట్టించుకోలేదు. కాసేపు ఆగిన తర్వాత మరికొంత ఊడి.. ఇంకా కిందకు జారింది. నోటికి అడ్డం రావడంతో ఆ విషయాన్ని గుర్తించిన కార్తీ.. దాన్ని సరిచేసుకుని, మళ్లీ ప్రెస్‌మీట్ కొనసాగించాడు. ఇలా, కెమెరాకి అడ్డంగా దొరికిపోయాడు.

Loading...

Leave a Reply

*