కాష్మోరా మార్నింగ్ షో టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..?

untitled-1

మూవీ : కాష్మోరా
నటీనటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్ తదితరుల
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ : ఓమ్ ప్రకాష్
నిర్మాతలు : ఎస్ఆర్. ప్రకాష్ బాబు, ఆర్ఆర్ బాబు
రచన, దర్శకత్వం : గోకుల్

కార్తి.. సూర్య బ్ర‌ద‌ర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. త‌నకంటూ సొంత క్రేజ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. యుగానికొక్క‌డు, ఆవారా, నా పేరు శివ చిత్రాల‌తో ఇక్క‌డ కూడా జెండా పాతాడు. ఇక‌, ఊపిరి చిత్రంతో స్ట్ర‌యిట్‌గా తెలుగులోనూ న‌టించి త‌న బేస్‌ని మ‌రింత సుస్థిరం చేసుకున్నాడు. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ కాష్మోరా.. న‌య‌న‌తార‌తోపాటు తెలుగ‌మ్మాయి శ్రీదివ్య హీరోయిన్‌లుగా న‌టించిన కాష్మోరా మార్నింగ్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం..

కథ :
ఇది మూడు భిన్న‌ కాలాల్లో సాగే కథ. నేటి కాలంతో పాటు 5 వంద‌ల ఏక్రితం సాగే కథ అలాగేఈ రెండు కాలాల మధ్య సాగే కథ. ఇలా మూడు భిన్నమైన కాలాల్లో సాగే ఈ కథలో ఆ మూడు కాలాల్లోనూ కనిపించే ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు. మరి ఈ ముగ్గురికీ మధ్య ఉన్న సంబంధం ఏంటీ.. ? ఇప్పటి కుర్రాడికి ఐదువందల యేళ్ల క్రితం కనిపించే ఓ చేతబడి చేసే వ్యక్తికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ అనేది కథ. మధ్యలో వచ్చే మరో పాత్ర ఏంటనేది కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది..

విశ్లేషణ :
ఇదో ప్ర‌యోగాత్మ‌క సినిమా అంటున్నారంతా. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఇది పూర్తిగా కార్తి మార్క్ సినిమా. అతనిలోని నటుడిని మరోసారి ఎలివేట్ చేసే మూవీగా చెబుతున్నారు. మూడు వైవిధ్య‌మైన పాత్రల్లో కార్తి నటన సూపర్ గా అనిపిస్తుందట‌. నేటి కుర్రాడిగా అల్లరిగా కనిపిస్తూనే ఐదువందల యేళ్లక్రితం కనిపించే పాత్రలో .. అతను చేతబడి చేసే వ్యక్తిగా కనిపిస్తాడు.. ఆ పాత్రలోనూ అంతే ఈజ్ తో ఒదిగిపోయాడని చెబుతున్నారు.

ముఖ్యంగా ఇది కమల్ హాసన్ లాంటి హీరో చేయాల్సిన పాత్రట‌. కానీ ఆ లోటేమీ కనిపించకుండా కార్తీ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. కాకపోతే పూర్తి స్థాయి గ్రాఫికల్ మూవీగా ఎక్స్ పెక్ట్ చేసిన వారికి నిరాశతప్పదు. ఇందులో గ్రాఫిక్స్ కేవలం ఐదువందల యేళ్ల క్రితం కథలో మాత్రమే కనిపిస్తాయి. ఆ కాలానికి తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ ను బాగా వాడారు. అలాగే నయనతార పాత్ర కూడా ఈ కాలంలోనే కనిపిస్తుంది. కాష్మోరాను ఎదుర్కొనే శక్తివంతమైన మహిళ పాత్రలో కనిపిస్తుంది నయన్. మిగతా సినిమా నేటి ట్రెండ్ కు అనుగుణంగా సాగినా.. నలభైఐదు నిమిషాల పాటు సాగే ఈ కథే సినిమాకు అత్యంత కీలకం.

కాకపోతే ఈ కథలో ఉన్నంత ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్సిటీ మిగతా రెండు కథల్లో పెద్దగా కనిపించకపోవడం మైనస్ అని చెబుతున్నారు. శ్రీదివ్యతో లవ్ సీన్స్ కూడా ఏమంత ఆకట్టుకోలేద‌ట‌. రొటీన్ గానే సాగుతున్నా.. మొత్తంగా ఈ మూడు కథలను ముడివేసిన తీరు మాత్రం ఆకట్టుకుంటుందని స‌మాచారం. పూర్తిస్థాయి ఎంట‌ర్‌ట‌యినింగ్‌గా కాకపోయినా.. కార్తి మార్క్‌ సినిమాలను ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది. ఐదువందల యేళ్ల క్రితం సాగే కథలో వచ్చే యుద్ధ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. మొత్తంగా మగధీర, బాహుబలి స్థాయిలో లేకపోయినా.. బాగానే ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాను వాటి సరసన నిలబెట్టడం కూడా కష్టమే. కానీ తమిళంలోనూ ఇలాంటి ప్రయోగాలు పెరుగడానికి మన మగధీర, బాహుబలి కారణం కావడం విశేషమే.

ఇక ఆర్టిస్టుల పరంగా హీరో, హీరోయిన్లుతో పాటు వివేక్ మాత్రమే మనకు తెలిసిన మొహాలు. ఇదో మైనస్. అంటే ఇలాంటి కథలో ఆర్టిస్ట్ కనెక్ట్ అయితేనే ఫీల్ కనెక్ట్ అవుతుంది. అదో మైనస్ గా కనిపిస్తుంది. ఇక కార్తీ ఎప్పట్లాగే మూడు పాత్రల్లో అదరగొడితే.. నయన్ సర్ ప్రైజింగ్ పెర్‌ఫార్మెన్స్‌ చూపించిందట‌. మ‌యూరి త‌ర్వాత మ‌రోసారి న‌ట‌న‌లో ఆక‌ట్టుకుంద‌ట‌. శ్రీదివ్య ఆల్రెడీ నటిగా ప్రూవ్ చేసుకుంది కాబట్టి తన పాత్ర వరకూ బాగానే చేసింది. వివేక్ కామెడీ అలరిస్తుంద‌నే మాట వినిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నా.. ఇంకా బావుంటే బావుండు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సూపర్. మ్యూజిక్ బావుందట‌. పాటలు కొంత మైనస్. మాటల్లో పెద్దగా డెప్త్ కనిపించదు. కాస్ట్యూమ్స్ అదిరిపోయాయంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. మొత్తంగా ఎక్స్ పెక్ట్ చేసినంత కాకపోయినా డిజప్పాయింట్ చేయడ‌ట‌ కాష్మోరా..

 

Loading...

Leave a Reply

*