జ‌న‌తా త‌ర్వాత‌.. ఈ సీజ‌న్‌లో అతిపెద్ద హిట్ కాష్మోరానే..!

untitled-1

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత టాలీవుడ్‌కి పెద్ద హిట్ ద‌క్క‌లేదు. ఈ మూవీ త‌ర్వాత అన్నీ చిన్న సినిమాలే విడుద‌ల‌యినా.. ఏదీ 30 కోట్ల మార్క్‌ను అందుకోలేక‌పోయింది. నాని, నాగ‌చైత‌న్య‌, రామ్, క‌ల్యాణ్‌రామ్‌ వంటి హీరోల సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌రికి వ‌చ్చినా ఏదీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకోలేక‌పోయింది. అన్నీ యావ‌రేజ్‌లు, బిలో యావ‌రేజ్‌లు మాత్ర‌మే. అన్నీ మీడియం రేంజ్ బ‌డ్జెట్ చిత్రాలే అయినా.. ఏ ఒక్క చిత్రం కూడా అంచ‌నాల‌ను రీచ్ కాలేక‌పోయింది.

రామ్ హైప‌ర్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ ప‌ర్లేద‌నిపించింది. ఇటు, క‌ల్యాణ్‌రామ్ ఇజం కూడా సో సోగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర న‌డుస్తోంది. నాని మ‌జ్ను ఆశించిన రేంజ్‌ని అందుకోలేక‌పోయింది. వీటికి తోడు సునీల్ ఈడు గోల్డ్ ఎహే, గ్రాఫిక్స్ మాయాజాలంతో వ‌చ్చిన నాగ‌భ‌ర‌ణం వంటి చిత్రాలు కూడా ఢ‌మాల్ అన్నాయి. దీంతో, బ‌య్య‌ర్ల‌లో నిరాశ మిగిలింది. సెకండాఫ్‌లో జ‌న‌తా గ్యారేజ్ మిన‌హా మ‌రే బిగ్ స‌క్సెస్ ఉండ‌ద‌ని భావిస్తున్న వారికి నేనున్నానంటూ ఓ డ‌బ్బింగ్ చిత్రం థియేట‌ర్ల‌లో ఎంట్రీ ఇచ్చింది. అదే కాష్మోరా.

కార్తి హీరోగా వ‌చ్చిన కాష్మోరాకి భారీ ఓపెనింగ్స్ ద‌క్కాయి. తొలిరోజే 4.5 కోట్లు ద‌క్కాయి. ఇక‌, తొలి వీకెండ్‌కి దాదాపు 10 కోట్ల మేర గ్రాస్ ద‌క్కింద‌ని సమాచారం. ఇక‌, సోమవారం కూడా ఈసినిమా క‌లెక్ష‌న్లు ఊహించిన రేంజ్‌లో డ్రాప్ కాలేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే, ఈ సీజ‌న్‌లో జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత అతి పెద్ద హిట్‌గా ఈ సినిమానే నిలిచే చాన్స్ ఉన్నాయి. హారర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కావ‌డం, గ్రాఫిక్స్ సినిమా రేంజ్‌ని పెంచాయి. రిలీజ్ త‌ర్వాత మ‌గ‌ధీర‌, అరుంధ‌తి వంటి సినిమాల‌కు కాస్త కాపీ అనిపించినా.. వ‌సూళ్లు మాత్రం ప‌డిపోలేదు. తెలుగులో కార్తికి పెరిగిన మార్కెట్ ఇది ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌. ధ‌నుష్ ధ‌ర్మయోగి కూడా ఇదే టైమ్‌లో రిలీజ్ అయినా.. అది అంత‌గా ఆడ‌లేదు. మ‌రి, కాష్మోరా ఏ రేంజ్‌లో స‌క్సెస్ సాధిస్తుందనేది చూడాలి.

Loading...

Leave a Reply

*