కార్తికి షాక్‌.. కాష్మోరాని థియేట‌ర్ల నుంచి లేపేస్తున్నారు..!

karthi

కాష్మోరా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌యింది. దీపావ‌ళి కానుక‌గా స్ట్ర‌యిట్ తెలుగు బ‌డా సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఇటు, చిన్న సినిమా మిస్ట‌ర్ 420 వ‌చ్చినా.. అది ఆడ‌లేదు. కార్తి కాష్మోరా, ధ‌నుష్ ధ‌ర్మయోగి చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. ట్ర‌యిల‌ర్‌తోనే కాష్మోరా ఆక‌ట్టుకోవ‌డం, మ‌గ‌ధీర‌, బాహుబ‌లిలా గ్రాఫిక‌ల్ మూవీ అని ప్ర‌మోట్ చెయ్య‌డంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత రెయిజ్ అయ్యాయి. రీసెంట్‌గా తెలుగులో ఆయ‌న న‌టించిన ఊపిరి సినిమా మంచి విజ‌యం సాధించ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. మ‌రోవైపు, ధ‌నుష్ ధ‌ర్మయోగి రిలీజ్ అయినా.. దానికి ఆయ‌న ప్ర‌మోష‌న్ చెయ్య‌లేదు. దీంతో, కాష్మోరాకి స‌హ‌జంగానే భారీ ఓపెనింగ్స్ ద‌క్కాయి.

సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ బాగా ఉన్నా… దానిని క్యాష్ చేసుకోవ‌డంలో కాష్మోరా ఫెయిల‌యింది. అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది కాష్మోరా. క‌థ‌, క‌థ‌నంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, మ‌గ‌ధీర‌కి బ్ర‌ద‌ర్‌, అరుంధ‌తికి అన్న‌య్య అనే టాక్ రావ‌డంతో కాష్మోరా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల ప‌డింది. వీకెండ్ వ‌ర‌కు బాగానే ఉన్నా.. సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్లు డ్రాప్ అయ్యాయి. దారుణంగా ప‌డిపోయాయి. గురువారం నాటికి ఆక్యుపెన్సీ రేషియో ఊహించ‌ని రేంజ్‌లో త‌గ్గింది.

దీంతో, ఈ వీకెండ్ నుంచి సినిమాని లేపేస్తున్నార‌ట‌. చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి. మ‌రో విష‌యం ఏంటంటే.. ధ‌నుష్ ధ‌ర్మయోగికి ధియేట‌ర్ల నెంబ‌ర్ పెర‌గ‌డం. ఒక్క నైజాంలోనే ఈ శుక్ర‌వారం నుంచి ధ‌ర్మయోగికి దాదాపు 30 థియేట‌ర్లు అద‌నంగా వ‌స్తున్నాయి. ఈ మేట‌ర్ తెలిసిన కార్తి.. హడావిడిగా చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్టూడియోల చుట్టూ రౌండ్స్ వేశాడు. సినిమాని లేపే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, అస‌లులో మేట‌ర్ లేనప్పుడు ఇలాంటి కొస‌రు ప‌నుల‌తో ఏమ‌యినా ఉప‌యోగం ఉంటుందా..?

Loading...

Leave a Reply

*