అలా ఆ సీన్‌లో క‌లిసి న‌టించారు.. వెంట‌నే పెళ్లి చేసేశారు..!

kanada-heroine-marriage

వీళ్లిద్ద‌రినీ గుర్తు ప‌ట్టారా…? వీళ్లు తెలుగు న‌టులు కాదు.. త‌మిళ్ న‌టులూ కాదు. వీరు.. క‌న్న‌డ హీరో హీరోయిన్‌లు. అయితే, ఈ ఇద్ద‌రి పెళ్లి ఇప్పుడు క‌న్న‌డనాట హాట్ టాపిక్‌గా మారింది. కొంద‌రు వీరివురికి మ్యారేజ్ చేసేశారు. కానీ, అలాంటిదేమీ లేద‌ని.. మా ఇద్ద‌రి మ‌ధ్య అస‌లు అలాంటి బంధ‌మే లేద‌ని, ఆ ఫోటోలు ఓ సినిమావి అని చెప్పుకోవ‌డానికి తెగ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

క‌న్న‌డ ర‌చ‌యిత నాగేంద్ర ప్ర‌సాద్‌కి, శాండ‌ల్‌వుడ్ న‌టి శుభ పూంజ‌కి గాసిప్ రాయుళ్లు పెళ్లి చేసేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. అందులోనూ మ్యారేజ్ సీన్ ఒక‌టుంది. దీంతో దండ‌లు వేసుకొని మ‌రీ క‌లిసి న‌టించారు. అంతే, ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాకి ఎక్కాయో లేదో.. వెంట‌నే మ్యారేజ్ అయిందంటూ సోష‌ల్ మీడియాని షేక్ చేసేశారు కొంద‌రు. గ‌త కొన్ని గంట‌లుగా శాండ‌ల్ వుడ్ వీరి పెళ్లి వ్య‌వ‌హారంపైనే హాట్ డిబేట్‌లు పెట్టింది.

ఫైన‌ల్‌గా తేలిందంటంటే.. ఇది ఓ సినిమా షూటింగ్ కోసం వేసుకున్న డ్ర‌స్ అని. త‌నకు ఇంకా పెళ్లి కాలేదని, తనను అభాసుపాలు చేయడానికే ఎవరో ఇలా చేశారని శుభ పూంజ‌ ఆరోపించారు. తాను చేస్తున్న కొత్త సినిమాకి సంబంధించి ఓ సీన్ కోసం క‌న్న‌డ ర‌చ‌యిత నాగేంద్ర‌ ప్రసాద్‌ గారితో కలిసి పెళ్లి సీన్‌లో నటించానని వివ‌రించింది. అయితే, లోకేషన్‌లో ఫొటో తీసినవారెవరో ఇలా చేసుంటారని ఆమె చెప్పారు. తనకు ఇప్పుడే పెళ్లిచేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఇదే విషయంపై సదరు పెళ్లి కుమారుడు రచయిత నాగేంద్ర ప్రసాద్ సోషల్‌మీడియాలో క్లారిటీ ఇచ్చారు. మా పెళ్లి వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేదన్నారు. ఓ సినిమా షూటింగ్ కో సం చేసిన సీన్ ఇది అన్నారు. త‌న‌కు ఇంత‌కుముందే పెళ్ల‌యింద‌ని తెలిపారు. ఈ మ్యారేజ్ అంతా బూట‌క‌మ‌ని స‌మాధాన‌మిచ్చారు. మొత్త‌మ్మీద‌, ఇద్ద‌రూ క‌లిసి ఈ వివాదానికి ఇలా ఎండ్‌కార్డ్ ప‌లికారు.

Loading...

Leave a Reply

*