ప్ర‌భాస్ హీరోయిన్ ఇలా షాక్ ఇచ్చింది..!

kangana-ranaut-shocks-everyone-with-backless-dress

ఈమె ఓ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..? బ్యాక్ లెస్ డ్ర‌స్‌తో ఓ ఈవెంట్‌కి హాజ‌ర‌యింది. అంతే, అక్క‌డున్న వారంతా ఆమెనే క‌న్నార్ప‌కుండా చూస్తున్నారు. ఆమె వెన‌కాలే ప‌రుగులు పెట్టారు కొంద‌రు యువ‌కులు. ఆమెకు అస‌లు విష‌యం అర్ధ‌మ‌యింది. తాను ఇలాంటి డ్ర‌స్ ఎందుకు వేసుకొని వ‌చ్చానో లేట్‌గా గ్ర‌హించినా ఈమె వెంట‌నే ఆ ఫంక్ష‌న్‌నుంచి మ‌ధ్య‌లోనే త‌ప్పించుకొని ప‌రార‌యింది.

ఇంత‌కీ ఈమె ఎవ‌రో ఇప్ప‌టిక‌యినా గుర్తు ప‌ట్టారా..? అవును, కంగ‌నా ర‌నౌత్‌. ఏక్ నిరంజ‌న్ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. హిందీ చిత్ర‌సీమ‌లో కంగ‌న‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. ఎక్కువ‌గా ఆమె త‌న న‌ట‌న‌, సినిమాల‌తోనే ఫోక‌స్‌లో ఉంటుంది. కానీ, ఇలాంటి డ్ర‌స్‌తో వ‌చ్చి అతి ఫ్యాష‌న్‌కి పోయి నాలుక క‌రుచుకుంది బాలీవుడ్ క్వీన్‌.

ఇటీవ‌ల కంగ‌నా, హృతిక్ రోష‌న్ ప్రేమాయణం ఎపిసోడ్‌తో వార్త‌ల్లో నిలిచింది. ఇద్ద‌రూ కోర్టులో కేసులు వేసుకునేదాకా వెళ్లారు. ఆ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ప‌డిందో లేదో ఇలా షాక్ ఇచ్చింది కంగ‌నా ర‌నౌత్‌. హిందీ చిత్ర‌సీమ‌లో వంద కోట్ల క్ల‌బ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఉన్న ఏకైక క‌థానాయిక ఈవిడే. త‌ను వెడ్స్ మ‌ను సీక్వెల్‌తో సుమారు ఆమె 160 కోట్లు క‌లెక్ట్ చేసింది. అజయ్‌దేవ్‌గ‌న్‌, అక్ష‌య్ కుమార్‌, షాహిద్ క‌పూర్ వంటి బడా హీరోల‌కు కూడా ఈ రేంజ్ హిట్ లేదు. అదీ ఆమె స్టామినా.

ఎప్పుడూ సింపుల్‌గా, హుందాగా క‌నిపించే కంగ‌నా.. త‌న ఫ్యాష‌న్ సినిమాని గుర్తుకు తెచ్చుకొని ఇలా ఫ్యాష‌న‌బుల్‌గా త‌యారై వ‌చ్చిన‌ట్లుంది. చివ‌రికి త‌న త‌ప్పు తెలుసుకొని వెంట‌నే షో నుంచి చెక్కేసింద‌ట ఈ బ్యూటీ.

Loading...

Leave a Reply

*