ఒకేసారి పూరి ఇద్ద‌రు హీరోయిన్‌ల‌కి రోడ్ యాక్సిడెంట్‌.. త‌ల‌కు గాయాలు..!

untitled-45

కంగ‌నా ర‌నౌత్ గుర్తుందా..? అదేనండి బాలీవుడ్ క్వీన్‌. హిందీ చిత్ర‌సీమ‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీతో 150 కోట్లు కొల్ల‌గొట్టిన ఏకైక హీరోయిన్‌. ఎలాంటి రోల్‌ని అయినా అవ‌లీల‌గా సింగిల్ హ్యాండ్‌తో చేసే పారేసే విల‌క్ష‌ణ న‌టి. వివాదాల‌కు కేరాఫ్. త‌న గ్లామ‌ర్‌తో, న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా అభిమానుల‌ను ద‌క్కించుకున్న కంగ‌నా ర‌నౌత్.. రోడ్డు ప్రమాదానాకి గుర‌య్యారు. ఓ సినిమా షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లిన ఆమె.. షూటింగ్ పూర్తి చేసుకొని హోట‌ల్‌కి తిరిగి వ‌స్తుండ‌గా యాక్సిడెంట్ అయింది. ఈ ప్ర‌మాదంలో ఆమె మోచేతుల‌కు, త‌ల‌కు చిన్న‌పాటి గాయాల‌య్యాయి. నుదుటిపైనా గాయ‌మయింది. దీంతో, త‌ల నుంచి ర‌క్త‌స్రావం జ‌రిగింది.

అయితే, ఈ యాక్సిడెంట్ ప్ర‌మాద‌మైన‌ది కాద‌ని యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ఇదే కారులో కంగ‌న‌తోపాటు హీరోలు వ‌రుణ్ ధావ‌న్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్‌, హీరోయిన్ దిశా ప‌టానీ కూడా ఉన్నారు. వారికి కూడా స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వ‌రుణ్ తేజ్ లోఫ‌ర్ హీరోయిన్ దిశాప‌టేల్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది ఈ మూవీ.ఇటు కంగ‌న తెలుగులో న‌టించిన ఏక్ నిరంజ‌న్‌కి కూడా ఆయ‌నే డైరెక్ట‌ర్‌. ఇలా, పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిచ‌యం చేసిన ఇద్ద‌రు హీరోయిన్‌లకు ఒకేసారి రోడ్డు యాక్సిడెంట్ అయింది.

Loading...

Leave a Reply

*