కమల్ కాపురంలోశృతి కాదు… బీజేపీ చిచ్చు?

kamal

13 ఏళ్ళ పచ్చటి సహజీవనం కాలిపోయింది. కారణాలు చెప్పుకున్న కమల్ నుంచి వేరుపడడం బాధకలిగిస్తుందని గౌతమీ చెప్పారు. ఐతే వీరి సహజీవనం ముక్కలు కావడానికి రాజకీయాలే కారణమని తెలుస్తుంది. ఇలా అనుకోవడానికి బలమైన రీసన్ వుంది. వన్ ఫైన్ మార్కింగ్ అనూహ్యంగా గౌతమీ ప్రధాని మోడీ ఎదుట ప్రత్యక్షమయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్య ని కూడా కలిశారు. ఇది పెను సంచలనానికి కారణమైంది. ఢిల్లీ వెళ్లి గౌతమీ పీఎం ని కలిశారంటే ఏదో పెద్ద విషయమే ఉంటుందని భావించారు అందరు.

ఇందులోనుంచే కమలహాసన్ బీజేపీ లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత సెకండ్ డే నే గౌతమీ విడాకుల ప్రకటన చేసారు. దీనంతటికి తనవల్ల కమల్ ఇమేజ్ దెబ్బతిన కూడదని గౌతమీ బావించడమే కారణమని తెలుస్తోంది. తాను రాజకీయంగా ఎదగాలన్న ఆమె కమలంతో ఉంటే దాని ప్రభావం అతని మీద పడుతుందని భావించే అతడి నుంచి వేరు పడినట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే త్వరలోనే గోతమిని బీజేపీ లో చూడవచ్చు.

Loading...

Leave a Reply

*