2 రోజుల క్రితం ప‌వ‌న్ కల్యాణ్‌ని ఏడిపించిన సినిమా ఇదే…!

p2

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పూర్తి ఎమోష‌న‌ల్‌.. ఆయ‌న ఆలోచ‌న‌లు, వ్య‌వ‌హార శైలి పూర్తిగా విభిన్నం. నిరాడంబ‌ర‌త‌, నిబ‌ద్ద‌త, నిజాయితీ ఆయ‌న సొంతం. ఆయ‌న ఏం చేసినా అందులో నిజాయితీ క‌నిపిస్తుంది. ప‌వన్ సినిమాలు చూడ‌డం చాలా త‌క్కువ‌. త‌న సినిమాల‌ను తానే చూడ‌డ‌ని గ‌తంలో ఓ సారి చెప్పాడు.అలాంటి ప‌వ‌న్ రీసెంట్‌గా క‌ల్యాణ్‌రామ్‌-పూరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఇజం సినిమాని చూశాడ‌ట‌. సాధార‌ణంగా పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల‌ను చూడ‌డానికి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌తాడ‌ట‌. పూరి సినిమాల‌లో ఉండే పంచ్‌, సొసైటీపై ఆయ‌న వేసే సెటైర్‌లు, రిమార్క్‌లు బాగా లైక్ చేస్తాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

అందులోనూ ఇజం చిత్రం.. గ‌తంలో తాను న‌టించిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమా బ్యాక్ డ్రాప్‌లోనే అంటే జ‌ర్న‌లిజం నేప‌థ్యంలోనే రూపొందింది. దీంతో, ఇజం సినిమాని చూడ‌డానికి ఇంట‌రెస్ట్ చూపించాడ‌ట ప‌వ‌ర్ స్టార్‌.దీపావ‌ళి సంద‌ర్భంగా షూటింగ్‌కి గ్యాప్ దొర‌క‌డంతో ప‌వ‌న్ ఇజం సినిమాని చూశాడ‌ట‌. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం ఆయ‌నకు బాగా న‌చ్చాయ‌ట‌. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు ఇది అతికిన‌ట్లు స‌రిపోతుంద‌ని భావించాడ‌ట ప‌వ‌న్‌. అంతేకాదు, ఇజం చూస్తున్న‌టైమ్‌లో ప‌వ‌న్ క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ని, ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

కోర్ట్ సీన్‌తోపాటు ప‌లు స‌న్నివేశాలు ప‌వ‌ర్‌స్టార్‌కి విప‌రీతంగా న‌చ్చాయ‌ట‌. అంతేకాదు, సీరియ‌స్ రోల్‌లో క‌ల్యాణ్‌రామ్ ఒదిగిపోయిన తీరు కూడా ప‌వ‌న్‌ని ముగ్ధుడుని చేసింద‌ట‌. సిక్స్ ప్యాక్ బాడీతోపాటు ఇజంలో క‌ల్యాణ్‌రామ్ పెర్‌ఫార్మెన్స్‌కి ప‌వ‌న్ స‌ర్‌ప్రయిజ్ అయ్యాడ‌ట‌. ప‌వ‌న్‌కి సాధారణంగా అన్ని సినిమాలు న‌చ్చ‌వు. ఆయ‌న‌ను కంట‌త‌డి పెట్టించే సినిమాల‌యితే మ‌రీ అరుదు. మ‌రి, ఇజం ఆయ‌న‌కు బాగానే క‌నెక్ట్ అయిన‌ట్లుంది.

Loading...

Leave a Reply

*