ఇజం సెన్సార్ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..?

ism-sensor

ఇజం సినిమా సెన్సార్ టాక్ పూర్తి చేసుకుంది. ఈ సాయంత్రం ఈ మూవీని సెన్సార్ బోర్డ్ సభ్యులు వీక్షించారు. సినిమాకి యు బై ఏ స‌ర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా నిడివి 2.25 నిముషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. ప‌క్కా ఫ్యామిలీ క‌మ్ యాక్ష‌న్ ఎంట‌ర్ ట‌యిన‌ర్‌గా తెర‌కెక్కింది ఈ మూవీ. పూరి మార్క్ హీరోయిజం, ల‌వ్ సీన్‌లు సినిమాకి మెయిన్ హైలైట్‌గా మార‌తాయ‌ని భావిస్తోంది సినిమా యూనిట్‌. ఈ నెల 21న విడుద‌లకు రెడీ అవుతోంది. బాలీవుడ్ భామ ఆదితి ఇజంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. క‌థ‌, క‌థ‌నంతోపాటు మాట‌లు కూడా పూరినే స‌మ‌కూర్చారు. జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది ఇజం. ఈ సినిమాపై వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్ ఇలా ఉంది.

క‌ల్యాణ్ రామ్ ఓ న్యూస్ చానెల్ రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ప‌క్కా ఐడియాలజీతో క‌నిపించే సిన్సియ‌ర్ పాత్రికేయుడు. అనుకోకుండా చేసే ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో భ‌యంక‌ర నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయట‌. దీంతో, క‌థ‌లో కొత్త ట్విస్ట్‌తో ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ట మూవీ. జ‌ర్న‌లిజం గొప్ప‌త‌నంతోపాటు, ఆ వృత్తిలోని లొసుగుల‌ని కూడా ఎత్తి చూపాడ‌ట పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ స్టింగ్ ఆప‌రేష‌న్ అవినీతి మీద అని స‌మ‌చారం. దేశంలో మూలుగుతున్న వేల కోట్ల న‌ల్ల‌ధ‌నంపై చేసే స్టింగ్ ఆప‌రేష‌న్ అట ఇది..

ఇజం ఫ‌స్ట్ హాఫ్ మొత్తం స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డుస్తుంద‌ట‌. హీరో ల‌వ్ ట్రాక్‌తోపాటు ఎల‌క్ర్టానిక్ మీడియాలో జ‌రిగే సీన్స్ అన్నింటిని పూస‌గుచ్చిన‌ట్లు చూపించాడ‌ట పూరి. రొమాంటిక్ సీన్స్‌లో త‌న మార్క్ ల‌వ్ సీన్‌లతో బాగా ఎంట‌ర్‌ట‌యిన్ చేశాడ‌ట. పూరి బ్రాండ్ హీరో క‌ల్యాణ్‌రామ్‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తాడ‌ట‌. అయితే, అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్‌లు కెమెరామెన్ గంగ‌తో రాంబాబుని గుర్తు చేస్తుంటాయ‌ట‌. ఇటు, కిక్, శివాజీ చిత్రాల‌ను కూడా రిక‌లెక్ట్ అవుతుంటాయ‌ట సినిమా చూస్తుంటే… ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు సినిమా బావుంద‌ని, సో సోగా న‌డిచిపోతుంద‌ని స‌మాచారం.

ఇక‌, సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి సినిమా తేలిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. క‌థేంటో ఫ‌స్ట్ హాఫ్ ఇంట‌ర్‌వెల్‌లోనే తెలిసిపోతుందని, దీంతో, లాగ్ బాగా ఉన్న‌ట్లు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటు, సీరియ‌స్ స‌బ్జెక్ట్ అవ‌డం కూడా ఇజంని ముందుకి న‌డిపించ‌లేక‌పోయింద‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి. మ‌రోవైపు, కామెడీ ట్రాక్ హిట్ అయితే, సినిమా మ‌రో రేంజ్‌కి వెళుతుంద‌ని, క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే చాన్స్ ఉంద‌ని స‌మాచారం. మ‌రి, ఇందులో నిజ‌మెంత అనేది మ‌రో వారంలో తేల‌నుంది.

క‌ల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ.. ఇజం. గ‌తేడాది విడుద‌ల‌యిన ప‌టాస్ త‌ర్వాత ఆయన నిర్మాత‌గానూ, హీరోగానూ ఫ్లాప్‌లు వ‌చ్చాయి. నిర్మాత‌గా కిక్ 2 వంటి డిజాస్ట‌ర్ వ‌స్తే.. హీరోగా షేర్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాడు. అందుకే, ఆయ‌న‌కు పూరి వంటి బ‌డా ద‌ర్శ‌కుడిని జ‌త చేసి ఇజంకు సాయ‌ప‌డ్డాడు ఎన్టీఆర్‌. అన్న‌య్య కోసం ఆయ‌న త‌న డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌ను కూడా ఒప్పించి సినిమాకి న‌ష్టాలు రాకుండా చూసుకునే ఏర్పాటు చేశాడు తార‌క్. మ‌రి, ఈ సినిమా క‌ల్యాణ్‌రామ్‌కి క‌లిసి వ‌స్తుందా? రాదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*