21న ఎన్టీఆర్ అన్న‌య్య‌ వ‌ర్సెస్ మ‌హేష్ కొడుకు…!

ntr-vs-mahesh

అవును, ఈ నెల 21న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంట‌రెస్టింగ్ ఫైట్ సాగ‌నుంది. వ‌చ్చే శుక్ర‌వారం ఇద్ద‌రు బ‌డా హీరోల వార‌సులు పోటీకి సై అంటున్నారు. అటు ఎన్టీఆర్ బిగ్ బ్ర‌ద‌ర్‌కి ఇటు మ‌హేష్ త‌న‌యుడు లాంటి త‌న‌యుడికి వార్ జ‌ర‌గ‌నుంది.

వ‌చ్చే శుక్ర‌వారం క‌ల్యాణ్‌రామ్ లేటెస్ట్‌మూవీ ఇజం విడుద‌ల కానుంది. పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. దేశాన్ని వ‌ణికించిన ప‌నామా లీక్స్‌, వికీ లీక్స్ లాంటి సంచ‌ల‌న మీడియా క‌థ‌నాలతో ఇజంను తెర‌కెక్కించాడ‌ట ద‌ర్శ‌కుడు పూరి. ఈ సినిమాలో క‌ల్యాణ్‌రామ్ సూప‌ర్‌హీరోగా మాస్క్‌తో క‌నిపించ‌నున్నాడు. బాలీవుడ్ భామ ఆదితి ఆర్య హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది ఈ మూవీలో. ఫ‌స్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌గా సాగ‌నున్న ఈ క‌థ‌.. సెకండ్ హాఫ్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయ‌ట‌.

ఇక‌, ఇదే వీకెండ్‌న మ‌హేష్ త‌న‌యుడు లాంటి త‌న‌యుడు న‌వీన్ విజ‌య్ న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అదేంటి అంటారా..? అవును, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా రూపొందిన‌. ‘ నందిని నర్సింగ్ హోమ్’ కూడా ఇదే వీకెండ్‌న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరి నవీన్ హీరో అయితే మహేష్ కొడుకు అంటారేంటీ అనుకుంటున్నారేమో.. ఒక రకమైన వరసతో చూస్తే నరేష్.. మహేష్ కు అన్న అవుతాడు. మరి అన్న కొడుకు తనకూ కొడుకు లాంటి వాడే కదా.. అందుకే ఆ మధ్య ఆడియోకు కూడా వచ్చిన మహేష్ బాబు తమ ఫ్యామిలీ నుంచి మరో హీరోను చూసుకోవాల్సిన బాధ్యతను ఫ్యాన్స్ పై ఉంచాడు.

ఇటు ఇజం సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి గెస్ట్‌గా తార‌క్ హాజ‌ర‌య్యాడు. అటు న‌వీన్ విజ‌య్ హీరోగా రూపొందిన మూవీ పాట‌ల వేడుక‌కి మ‌హేష్ ముఖ్య అతిథి. ఇలా ఇద్ద‌రూ ఆ రెండు సినిమాల ప్ర‌మోష‌న్ కూడా చేశారు. ఈ రేస్‌లో క‌ల్యాణ్‌రామ్‌కే అప్ప‌ర్ హ్యాండ్ క‌నిపిస్తోంది. మ‌రి, విన్న‌ర్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*