త‌మ్ముడి కోసం అన్న త్యాగం.. నంద‌మూరి అనుబంధం..!

bro

నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రస్తుతం ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నారో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కళ్యాణ్ రామ్ నటించిన ఇజం చిత్రం మ‌రికొన్ని గంట‌ల్లో విడుదల కానుండగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది.అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇజం చిత్రాన్ని అసలు ఈ రోజే విడుదల చేయాలని యూనిట్ భావించిందట.

కాని ఈ రోజు ఇజం విడుదలైతే జనతా గ్యారేజ్ చిత్రాన్ని థియేటర్ల నుండి తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఎన్టీఆర్ సినిమా 50 రోజులు ఆడిన థియేటర్ల సంఖ్య తగ్గుతుంది. ఇది ఆలోచించిన కళ్యాణ్ రామ్ ఇజం చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల అయ్యేలా నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవలి కాలంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన జనతా గ్యారేజ్ నేటితో 39 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 23న చిత్రాన్ని బుల్లి తెరపై ప్రదర్శించబోతున్నారు.

Loading...

Leave a Reply

*