నంద‌మూరి వార‌స‌త్వాన్ని కాపాడిన క‌ల్యాణ్‌రామ్‌..!

kalyan

టాలీవుడ్‌లో నందమూరి హీరోలు డిఫ‌రెంట్‌. వాళ్ల‌కి ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల‌కి సెప‌రేట్ బాడీ లాంగ్వేజ్‌, సినిమా టైటిల్స్ ఉంటాయి. ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు సెప‌రేట్ ట్రెండ్ క్రియేట్ చేసింది వారే. ఇక‌, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌లు, తొడ కొట్ట‌డాలు, సుమో ఫైట్‌లు, చాంతాడంత డైలాగ్‌లు, ఆవేశ‌పూరిత‌మైన సినిమాలు చెయ్యాలంటే వారికే సాధ్యం. ఇత‌ర హీరోల‌కి ఆ ఇమేజ్ లేదు. నంద‌మూరి ఫ్యామిలీనుంచి వ‌చ్చిన వారికి మాత్ర‌మే సాధ్యమ‌యిన ఇమేజ్ ఇది. బాల‌య్య నుంచి క‌ల్యాణ్ రామ్ దాకా అంద‌రూ ఇదే రూట్‌ని ఫాలో అవుతున్నారు.

ఇక‌, ఆ ఫ్యామిలీ హీరోలకి మ‌రో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే.. కోర్ట్ సీన్‌లు.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వ‌ర‌కు కోర్ట్ సీన్‌లలో నంద‌మూరి కుటుంబానికి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. ఈ ఐడెంటిటీని కాపాడ‌డంలో మ‌రోసారి క‌ల్యాణ్‌రామ్ స‌క్సెస్ అయ్యాడు. ఇజం మూవీ క్ల‌యిమాక్స్‌లో వ‌చ్చిన కోర్ట్ సీన్ సినిమాకి హైలైట్‌గా మారింది. క‌ల్యాణ్‌రామ్ న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ తీరు అంద‌రికీ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక దేశ‌భ‌క్తితో వ‌చ్చిన ఈ సీన్‌తో ఆడియెన్స్ హ్యాపీగా వెను దిరుగుతాడు సినిమా థియేటర్ల నుంచి.బొబ్బిలిపులిలో ఎన్టీఆర్ చేసిన కోర్ట్ సీన్‌కి టాలీవుడ్‌లో ఎప్ప‌టికీ చెర‌గ‌ని ఇమేజ్ ఉంటుంది.

కోర్ట్ కోర్ట్‌కి తీర్పు తీర్పుకి.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన దాస‌రి డైలాగ్‌లు ఇప్ప‌టికీ మ‌న చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి. ఇక‌, రాఖీ, టెంప‌ర్ చిత్రాల‌లో తార‌క్ చేసిన కోర్ట్ సీన్‌లు కూడా అదిరిపోతాయి. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమాలో కోర్ట్ సీన్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అదిరిపోతుంది. న‌టుడిగా తార‌క్ డెప్త్‌ని తెలిపిన సీన్‌ల‌లో ఇది ఒక‌టి అని చెప్పొచ్చు. ఇక‌, తాజాగా క‌ల్యాణ్ రామ్‌కి కూడా పూరి అలాంటి సీనే ఒక‌టి పెట్టాడు ఇజంలో. సినిమా విడుద‌ల‌కు ముందు నుంచే దీనిపై పూరి హింట్ ఇచ్చినా.. రిలీజ్ త‌ర్వాత థియేట‌ర్ల‌లో చూస్తే భారీ అప్లాజ్ వ‌స్తోంది. ఇలా, కోర్టు సీన్‌ల‌తో నంద‌మూరి వార‌స‌త్వాన్ని కాపాడని అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

Loading...

Leave a Reply

*