రెండో గండం దాటుతాడా…

kalyan

మనలో చాలామంది దర్శకుల వద్ద ఉన్న ప్రాబ్లమ్ ఇదే. మొదటి సినిమాకి హిట్ ఇచ్చి, రెండో సినిమాకు చతికిలపడిన డైరక్టర్లు చాలామంది ఉన్నరు. మరీ ముఖ్యంగా నాగచైతన్య కెరీర్ లో ఇలాంటి వాళ్లు చాలామంది. ఇప్పుడు ఈ జాబితాలోకి కల్యాణ్ కృష్ణ చేరకూడదని అక్కినేని ఫ్యాన్స్ కోటిదేవుళ్లకు మొక్కుకుంటున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న కల్యాణ్ కృష్ణ.. తన రెండో ప్రయత్నంగా చైతూతో ఓ సినిమా తీస్తున్నాడు. ఈనోెల 9 నుంచి ఇది సెట్స్ పైకి రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో ఈ సినిమా అంతా పేపర్ పై గ్రాండ్ గానే కనిపిస్తోంది. ఒక్క సెకెండ్ సెంటిమెంట్ తప్ప.

గతంలో విజయ్ కుమార్ కొండాను ఇలానే పిలిచిమరీ అవకాశం ఇచ్చాడు నాగచైతన్య. కానీ చైతూకు తన రెండో సినిమాతో కొండ ఫ్లాప్ ఇచ్చాడు. స్వామిరారాతో హిట్ అందుకున్న సుధీర్ వర్మకు కూడా ఇలానే కోరి ఛాన్స్ ఇచ్చాడు చైతూ. అతడు కూడా చైతూతో దోచేయ్ లాంటి ఫ్లాప్ మూవీ తీశాడు. ఈ దర్శకులందరికీ ఇవి రెండో సినిమాలే. ఇప్పుడు కల్యాణ్ కృష్ణ కూడా రెండో సినిమా సెంటిమెంట్ లోకి ఎఁటర్ అవుతున్నాడు.

అయితే ఈసారి కల్యాణ్ కృష్ణకు అలాంటి ఇబ్బందేం ఉండదంటున్నారు చాలామంది. ఎఁదుకంటే.. ఈసారి కల్యాణ్ కృష్ణ మరింత పక్కాగా స్టోరీ రాసుకున్నాడట. సోగ్గాడే చిన్నినాయనా సినిమా కోసం ఎలాగైతే పక్కా కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యాడో… తన రెండో సినిమాకు కూడా సరిగ్గా అలాంటి కమర్షియల్ ఫార్మాట్ నే ఎంచుకున్నాడట. అది ఎంతలా అంటే.. ఈ సినిమా మల్టీప్లెక్సుల్లో ఆడకపోయినా.. బి, సి సెంటర్లలో కచ్చితంగా ఆడుతుందట. అది అలాంటి కథ అంటున్నారు.

Loading...

Leave a Reply

*