ఆ హీరో, ఆ హీరో తండ్రికి కాజ‌ల్ స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చింది.. ఏంటి మేట‌ర్‌..?

kajal

ఈ ఏడాది స‌మ్మ‌ర్ దాకా కాజ‌ల్ ఫ్లాప్ హీరోయిన్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, బ్ర‌హ్మోత్స‌వం చిత్రాల ఫ్లాప్‌తో ఆమెకు ఇక చాన్స్‌లు రావ‌నుకున్నారు. కానీ, జ‌న‌తా గ్యారేజ్‌లోని ఐటెం సాంగ్‌తో ఆమె ఫేట్ మారిపోయింది. ఆమె కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డింది. దీంతో, ఫ్లాప్ హీరోయిన్ అనే ఇమేజ్ చెరిగిపోయింది.. స‌క్సెస్‌ఫుల్ క‌థానాయిక‌గా కెరీర్‌ని ఎంజాయ్ చేస్తోంది.

త‌మిళ్‌లో ఆమె మూడు బ‌డా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటే.. తెలుగులోనూ రెండు చిత్రాలు చే్స్తోంది. చిరంజీవి స‌ర‌స‌న ఖైదీ నెంబ‌ర్ 150తోపాటు రానాతో క‌లిసి తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చేస్తోంది. ఖైదీ నెంబ‌ర్ 150స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్‌కి రెడీ అవుతుండ‌గా, తేజ డైరెక్ష‌న్‌లోని మూవీ ఫిబ్ర‌వ‌రి ఎండింగ్ లేదా మార్చి స్టార్టింగ్‌లో విడుద‌ల‌య్యే చాన్స్ ఉంది.

ఎప్పుడూ కెరీర్ విష‌యాల‌నే షేర్ చేసుకునే ఈ అమ్మ‌డు తాజాగా త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా ట్విట్ట‌ర్‌కి ఎక్కిస్తోంది. రీసెంట్‌గా కాజ‌ల్ హీరో రానా, ఆయ‌న తండ్రి.. తేజ సినిమాకి నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉన్న సురేష్ బాబుని త‌న ఇంటికి ఆహ్వానించింది. అక్క‌డ వారికి చిన్న పార్టీ కూడా ఇచ్చింద‌ట‌. దీనికి ద‌ర్శ‌కుడు తేజ కూడా హాజ‌ర‌య్యాడు. ఇలా, కాజ‌ల్ న‌టిస్తున్న తేజ సినిమాలో ఈ ముగ్గురి భాగ‌స్వామ్యం ఉండ‌డంతో.. పిలిచి ఇలా ట్రీట్ ఇచ్చింద‌ట బంతిపూల జాన‌కి. త‌న ఇంటికి స్పెష‌ల్ గెస్ట్‌లు వ‌చ్చార‌ని ట్వీట్ చేసింది. అంతేత‌ప్ప‌, అంత‌కంటే మేట‌ర్ ఏమీ లేద‌ట‌.

kajal-rana

Loading...

Leave a Reply

*