ఫ‌స్ట్ నైట్‌కి రెడీ అయిన కాజల్ అగ‌ర్వాల్..!

kajal

రీసెంట్‌గా వ‌ర‌స ఫ్లాప్‌ల‌తో డ‌ల్ అయిన పంచ‌దార బొమ్మ‌.. జ‌న‌తా గ్యారేజ్‌లోని ప‌క్కా లోక‌ల్ ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయింది. యువ‌కుల హాట్ బీట్ పెంచింది. ఆ ఒక్క సాంగ్‌తోనే టాలీవుడ్‌లో మ‌ళ్లీ రెయిజ్ అయింది. మ‌ళ్లీ వ‌ర‌స చాన్స్‌లతో ఫుల్ బిజీగా ఉంది.

అయితే, కాజ‌ల్ ఫోటో చూశారా..? అదిరిపోయింది క‌దూ.? అవును, ఇది ఆమె ఫ‌స్ట్ నైట్ కోసం రెడీ అవుతున్న సీన్ ఫోటో. యాంటిక్ జెవెల్ల‌రీ, కొప్పు ముడిచి అందాల బొమ్మ‌లా ఉంది క‌దూ బంతిపూల జాన‌కి. ఆమెకు ఇది ఫ‌స్ట్ నైట్ సీన్ అట‌. అందుకే, స్పెష‌ల్‌గా రెడీ అవుతోంది. సుదీప్ స‌ర‌స‌న న‌టిస్తున్న ఓ చిత్రంలోని సీన్ అట‌. సినిమాలో ఈ శోభ‌నం సీన్ త‌ర్వాత వెంట‌నే పాట కూడా వ‌స్తుంద‌ట‌. అందుకే, కాజ‌ల్‌ని స్పెష‌ల్‌గా ముస్తాబు చేస్తున్నార‌ట మేక‌ప్ సిబ్బంది. అందుకే, అస‌లే అంద‌గత్తె అయిన కాజ‌ల్ అందం మ‌రింత ద్విగుణీకృతం అయింది ఈ డ్ర‌స్‌లో. శోభ‌న‌పు పెళ్లికూతురు క‌ళ వ‌చ్చేసింది క‌దూ ఆమెను చూస్తుంటే..?

జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్‌తో కాజ‌ల్ ఫేట్ మళ్లీ మారిపోయింది. రీసెంట్‌గా ఆమె క్రేజ్ త‌గ్గ‌డంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పి మ్యారేజ్‌కి రెడీ అవుతుంద‌ని భావించారంతా. అయితే, అలాంటిదేమీ లేద‌ని, ప్రూవ్ చేసింది. ప్రెజెంట్ స‌మంత నాగ‌చైత‌న్య‌తో పెళ్లికి రెడీ అవడంతో… ఆమె చాన్స్‌లు కూడా కాజ‌ల్‌నే వ‌రిస్తున్నాయి. ఇటు, త‌మ‌న్న‌కు క్రేజ్ త‌గ్గ‌డం, శృతిహాస‌న్ తెలుగులో సినిమాల‌ను త‌గ్గించ‌డంతో కాజ‌ల్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. వ‌ర‌స‌గా సినిమాల‌కు సైన్ చేస్తోంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో బిజీగా ఉంది. త‌మిళ్‌లో ఆమెకు చాన్స్‌లు క్యూ క‌డుతున్నాయి. తెలుగులోనూ మ‌రిన్ని బ‌డా సినిమాల‌కు క‌మిట్ అయ్యే ఆలోచ‌న‌లో ఉంది బంతిపూల జాన‌కి.

Loading...

Leave a Reply

*