తమన్న సినిమాకు కాజల్ ప్రమోషన్

untitled-3

అవును.. మిల్కీబ్యూటీ మూవీకి చందమామ కాజల్ ప్రచారం చేస్తోంది. స్వయంగా ఓ సినిమా టీజర్ ను విడుదల చేసింది. అయితే వీళ్లిద్దరూ మంచి దోస్తులే కావొచ్చు కానీ.. వీళ్లను ఇలా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది మాత్రం హీరో విశాల్ అనే చెప్పాలి. అవును… కాజల్, తమన్నాలకు కామన్ ఫ్రెండ్ విశాల్. అందుకే తన సినిమా కోసం వీళ్లిద్దర్నీ ఒకటి చేశాడు.

తమిళ్ లో తమన్న హీరోయిన్ గా తను చేసిన ఓ సినిమాను తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో విడుదల చేయడానికి విశాల్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాజల్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఒక్కడొచ్చాడు సినిమా తమిళనాట యావరేజ్ గా ఆడింది. తెలుగులో ఇది బిచ్చగాడు టైపులో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంటుందనే ధీమాతో ఉన్నాడు విశాల్.

మరోవైపు తెలుగులో ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందని చెప్పడానికి విశాల్ దగ్గర ఇంకో రీజన్ కూడా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించాడు. టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా తెలిసిన జగపతిబాబు ఉన్నాడు కాబట్టి… సినిమాకు రీచ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ధృవ సినిమాకు సంగీతం అందిస్తున్న హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందించాడు.

Loading...

Leave a Reply

*