కాజల్ కు ఇప్పట్లో పెళ్లి లేనట్టే…

kajal

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కాజల్ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. కానీ జనాలు మాత్రం నమ్మలేదు. తన చెల్లెలు చేసుకున్నట్టుగానే సెడన్ గా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇస్తుందని జనాలకు గట్టి నమ్మకం. పైగా దుబాయ్ కు చెందిన ఓ బిజినెస్ మాగ్నెట్ తో కాజల్ కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తోందనే వార్తలు కూడా ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అందుకే పెళ్లికి ఇంకా టైం ఉందని కాజల్ చెబుతున్నా ఎవరూ నమ్మలేదు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కాజల్ మాటలు నమ్మాల్సి తీరాల్సిందే. ఎందుకంటే… సినిమాలతో అంత బిజీ అయిపోయింది ఈ బుట్టబొమ్మ. తను ప్రస్తుతం సినిమాలపైనే దృష్టిపెట్టాననే కాజల్ మాటల్ని నిజంగానే నమ్మాల్సి వస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సరసన నటిస్తున్న కాజల్… త్వరలోనే రానాతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. కుదిరితే వెంకీ సినిమాలో కూడా నటించే అవకాశం ఉంది. వీటితో పాటు తెలుగులో మరో సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించనుందట.

అటు తమిళ్ లో కూడా విజయ్ సరసన మరోసారి నటించేందుకు రంగం సిద్ధంచేసింది కాజల్. వీటితో పాటు బాలీవుడ్ నుంచి కూడా మరో బి-గ్రేడ్ మూవీ ఆఫర్ వచ్చిందట. రెమ్యూనరేషన్ బాగా వస్తుండడంతో.. ఆ సినిమాలో కూడా నటించాలని కాజల్ అనుకుంటోందట. సో… ఇంత బిజీగా ఉన్న కాజల్ ఈ టైమ్ లో పెళ్లి చేసుకొని, సినిమాలు వదిలేస్తుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు.

Loading...

Leave a Reply

*