ఆ హీరో నన్ను వాడుకొని వదిలేశాడు.. బాంబ్ పేల్చిన కాజ‌ల్‌..!

kajal

కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌. స‌మంతకి మ్యారేజ్ ఫిక్స్ అవ‌డం, ర‌కుల్ ఇప్పుడిప్పుడే రెయిజ్ అవ‌డం, శృతిహాస‌న్ ఏడాదికి ఒక‌టీ అరా సినిమాలే చేస్తుండ‌డంతో ఒక్క‌సారిగా బంతిపూల జాన‌కికి డిమాండ్ పెరిగింది. మ‌రోవైపు, జ‌న‌తా గ్యారేజ్ మూవీలో ఆమె  చేసిన ప‌క్కా లోక‌ల్ ఐటెం సాంగ్‌తో కాజ‌ల్ రేంజ్ గ్రాఫ్ మరింత రెయిజ్ అయింది. ప్ర‌స్తుతం ఆమె చిరంజీవి స‌ర‌స‌న ఖైదీ నెంబ‌ర్ 150తోపాటు మ‌రో రెండు సినిమాలున్నాయి.

కెరీర్‌ని ప‌క్క‌న పెడితే… వ్య‌క్తిగ‌త జీవితంలో కాజ‌ల్‌పై అఫైర్‌లు త‌క్కువ‌. అయిదారేళ్ల క్రితం.. ప్ర‌భాస్‌తో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అనే మాట వినిపించినా.. అది రూమ‌ర్‌గానే మిగిలింది. ప్రెజెంట్ ఓ ముంబై బిజినెస్‌మేన్‌తో ఆమె ప్రేమాయ‌ణం సాగిస్తుంద‌నే ప్ర‌చారం ఉన్నా, అంత సీన్ లేద‌ని తెలిపింది కాజ‌ల్‌. అయితే, త‌న కెరీర్‌లో త‌న‌ను బాగా ఉపయోగించుకున్న ఒక హీరో.. సడెన్‌గా వదిలేశాడని తన స్నేహితుల వద్ద వాపోయిందట. అది సౌత్ హీరో కాదు.. బాలీవుడ్ క‌థానాయ‌కుడు.

బాలీవుడ్‌లో చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రొమాంటిక్ హీరో షాహిద్ కపూర్‌తో ఒక సినిమాకు సెలెక్ట్ అయింద‌ట కాజ‌ల్‌. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి రిలేష‌న్‌ ఏర్పడిందట. ఈ చనువుతో తనకు ఉన్న లగ్జరీ కారును షాహిద్ విపరీతంగా వాడేసుకున్నాడని, చివరికి సినిమా ఆగిపోవడంతో సడెన్‌గా మాట్లాడ్డం మానేశాడని, కనీసం ఫోన్ కూడా చేయడం మానేశాడని చెప్పుకొచ్చిందట. తనతో చనువుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి, ఇలా సడెన్‌గా మాట్లాడడం మానేసిన ఒకే ఒక వ్యక్తి కూడా షాహిదే అని చెప్పిందట. ఇప్పుడు బాలీవుడ్‌ జనాలు దీని గురించి ఒకటే గుసగుసలాడుతున్నారు.

 

Loading...

Leave a Reply

*