షాకింగ్‌… స‌ర్దార్ డైరెక్ట‌ర్‌తో తార‌క్…!

jr-ntr-new-movie

ఎన్టీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడా..? రెండు నెల‌లుగా ద‌ర్శ‌కుడి వేట‌లో బిజీగా ఉన్న తార‌క్‌.. ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడా? పూరిని కాద‌ని, త్రివిక్ర‌మ్, వినాయ‌క్ ఖాళీగా లేర‌ని, అనిల్ రావిపూడి క‌థ న‌చ్చ‌లేద‌ని, వ‌క్కంతం వంశీతో గొడ‌వ‌ల‌ని.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఏ సినిమా షురూ చెయ్య‌ని తార‌క్‌.. తాజాగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

జన‌తా గ్యారేజ్ త‌ర్వాత తార‌క్‌.. ఎంద‌రో ద‌ర్శ‌కుల‌ను అప్రోచ్ అయ్యాడు. ప‌లువురు ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు కూడా విన్నాడు. కానీ, ఏ సినిమా ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. ఏ ద‌ర్శ‌కుడితోనూ క‌మిట‌వ్వ‌లేదు. జ‌న‌తా గ్యారేజ్ మూవీతో తార‌క్ కెరీర్‌లోనే ది బెస్ట్ స‌క్సెస్ అందుకున్నాడు. టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఆల్‌టైమ్ టాప్ 3లో నిలిచాడు. దీంతో, త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌పై ఆయ‌న కేర్ తీసుకోవాల్సిన ప‌రిస్థితిలో ఉన్నాడు. అందుకే, పూరితో క‌మిట్ అవుదామ‌ని భావించినా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ మూవీ ఫలితం చూసిన తార‌క్‌…. పూరికి హ్యాండ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

రీసెంట్‌గా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ద‌ర్శ‌కుడు బాబీ చెప్పిన క‌థ‌… తార‌క్‌కి బాగా న‌చ్చింద‌ట‌. దీంతో, దానిని డెవ‌ల‌ప్ చెయ్య‌మ‌ని ఆదేశించాడ‌ట తార‌క్‌. ప‌వ‌న్‌తో చేసిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ మూవీ ఆశించిన రేంజ్‌లో ఆడ‌లేదు. ఆ సినిమాపై భారీ అంచ‌నాలున్నా ఫ్లాప్ అయింది. అయితే,ప‌వ‌న్ క‌ల్యాణ్ స్క్రిప్ట్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డంతోనే సినిమా ప‌రాజయం పొందింద‌నే టాక్ ఉంది. ద‌ర్శ‌కుడిగా బాబీ స్టామినా ఏంటో ప‌వ‌ర్‌తో చూపించాడు. ర‌వితేజ‌తో వ‌చ్చిన ప‌వ‌ర్ సినిమా చూసే ప‌వన్ అత‌నికి చాన్స్ ఇచ్చాడు. ఇది ఎన్టీఆర్‌ని కూడా ఇంప్రెస్ చేసింద‌ట‌. అందుకే, త‌క్కువ టైమ్‌లో సినిమా చేసి రిలీజ్ చెయ్యాల‌నే క‌మిట్‌మెంట్‌తో యంగ్‌టైగ‌ర్ బాబీకి చాన్స్ ఇచ్చాడ‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. మ‌రి, పూరినే ప‌క్క‌న‌పెట్టిన తార‌క్‌.. నిజంగా బాబీకి ఆఫ‌ర్ ఇచ్చిఉంటాడా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Loading...

Leave a Reply

*