టక్కరి దొంగ మళ్లీ వస్తున్నాడు…

untitled-6

టక్కరిదొంగ అనగానే ఎవరికైనా మహేష్ బాబు గుర్తొస్తాడు. కానీ ఇక్కడ టక్కరిదొంగ మహేష్ బాబు కాదు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన జయంత్ సి.పరాన్జీ. అవును… మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న ఈ దర్శకుుడ ఇప్పుడు మరోసారి మహేష్ బాబును కెలికే పనిలో ఉన్నాడట. కుదిరేత మహేష్ తో మరో డిఫరెంట్ సినిమా చేస్తానంటున్నాడు. ఈ మేరకు మహేష్ భార్య నమ్రతతో సంప్రదింపులు జరుపుతున్నాడట జయంత్.

టక్కరి దొంగ సినిమా దెబ్బలు అలాంటిలాంటివి కాదు. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరెక్కింది ఆ సినిమా. మహేష్ బాబు చేసిన మొదటి కౌబాయ్ సినిమా అది. అట్టర్ ఫ్లాప్ అయింది. అందులో లీసారే, బిపాసా చేసిన ఎక్స్ పోజింగ్ చూసి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్లడానికి జడుసుకున్నారు. అలా మహేష్ అప్పటివరకు తెచ్చుకున్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ ను మంటగలిపాడు జయంత్. అలాంటి దర్శకుడు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాడు.

మహేష్ ఓకే అంటే రెండు కథలు వినిపించడానికి సిద్దంగా ఉన్నాడట జయంత్. అయితే మహేష్ ను మాత్రం ఇప్పటివరకు కలవలేదట. కేవలం నమ్రత దగ్గరే మేటర్ ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి మహేష్ ఫ్యాన్స్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నారు. మేటర్ నమ్రత దగ్గరే ఆగిపోతే మంచిదని అనుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*