బుల్లితెర‌పైనా జ‌న‌తా గ్యారేజ్ సంచ‌ల‌నం..!

ntr

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జ‌న‌తా గ్యారేజ్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది ఈ చిత్రం. విడుద‌ల‌యిన తొలి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఆ త‌ర్వాత టాలీవుడ్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది. బాహుబ‌లి, శ్రీమంతుడు త‌రవాత టాలీవుడ్‌లో ఈ చిత్రానిదే రికార్డ్‌. దాదాపు 82 కోట్లు కలెక్ట్ చేసి క‌లెక్ష‌న్ల పంట పండించింది జ‌న‌తా గ్యారేజ్‌.అయితే, జ‌న‌తా గ్యారేజ్ ఫిఫ్టీడేస్ పూర్తి చేసుకుందో లేదో.. ఆ సినిమా బుల్లితెర‌పై ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది. గ‌త ఆదివారం జ‌న‌తా గ్యారేజ్ మా టీవీలో టెలికాస్ట్ అయింది. ఈ మూవీని మా టీవీ భారీగా ప్ర‌మోట్ చేసింది.

గ‌త ప‌దిరోజులుగా ట్ర‌యిల‌ర్‌లతో హంగామా క్రియేట్ చేసింది. ఇది ప‌క్క‌న పెడితే.. ఈ ఆదివారం టెలికాస్ట్ అయిన జ‌న‌తా గ్యారేజ్‌ని.. బుల్లితెర ప్రేక్ష‌కులు గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నార‌ట‌. టీఆర్పీలు అదిరిపోయే రేంజ్‌లో ఉండే చాన్స్ ఉందంటోంది మా టీవీ యాజ‌మాన్యం.రీసెంట్‌గా బడా హీరోల సినిమాల‌కు కూడా అంతంత‌మాత్ర‌మే టీఆర్పీలు వ‌స్తున్నాయి. మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం చిత్రానికి కేవ‌లం.. 8 టీఆర్పీ ద‌క్కింద‌ట‌. ఇది చాలా త‌క్కువ‌. అదే చిన్న చిత్ర‌మ‌యినా బిచ్చ‌గాడుకి 18 పాయింట్‌ల టీఆర్పీ ద‌క్కింది.

ఇది ఓ సెన్సేష‌న్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు జ‌నతా గ్యారేజ్ రేటింగ్ 20 ప్ల‌స్ ఉండే చాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. ఈ సినిమా మా టీవీ భారీగా క్యాష్ చేసుకుంద‌ని, అందుకే, బ్రేక్‌కి బ్రేక్‌కి మ‌ధ్య‌లో యాడ్‌లు భారీగా వ‌చ్చాయ‌ని వివ‌రిస్తున్నారు. మ‌రి, జ‌న‌తా గ్యారేజ్ బుల్లితెర‌పై ఎలాంటి రేటింగ్స్ ద‌క్కించుకుంటుందో తేలాలంటే మ‌రో అయిదు రోజులు వెయిట్ చెయ్య‌క త‌ప్పడు. గురువారం లేదా శుక్ర‌వారానికి టీఆర్‌పీలు వ‌చ్చే చాన్స్ ఉంది.

Loading...

Leave a Reply

*