జనతా దూకుడుకు మజ్ను బ్రేక్…

ntr

ఇన్నాళ్లూ ఎదురులేకుండా దూసుకెళ్లింది. మరే సినిమా జనతా గ్యారేజ్ కు బ్రేక్ వేయలేకపోయింది. బడా సినిమాలు కూడా లేకపోవడంతో… నీ దూకడు సాటెవ్వరు అనే రేంజ్ లో ఎన్టీఆర్ రెచ్చిపోయాడు. సినిమా విడుదలైన వారం గ్యాప్ లో జ్యో అచ్యుతానంద అనే సినిమా వచ్చినప్పటికీ… గ్యారేజ్ కు దీటుగా నిలవలేకపోయింది. డీసెంట్ హిట్ మాత్రం అయింది. అయితే ఇన్నిరోజులకు గ్యారేజ్ ను అడ్డుకునే సినిమా వచ్చింది.

ఈ వీకెండ్ మజ్నుగా థియేటర్లలోకి వచ్చాడు నాని. ఎన్టీఆర్ ఎలాగైతే వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడో… నాని కూడా అలానే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. జనతా తో తారక్ తన రేంజ్ ను పెంచుకున్నట్టుగానే… మజ్నుతో నాని కూడా రేంజ్ పెంచుకున్నాడు. అవును… మజ్ను పాజిటివ్ టాక్ తో ప్రారంభమైంది. సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. ఈ వీకెండ్ మాత్రమే కాదు… వచ్చే వారం నుంచి జనతా గ్యారేజ్ వసూళ్లు కచ్చితంగా తగ్గుతాయి.

విడుదలై 3 వారాలైన జనతా గ్యారేజ్ ను మళ్ళీ చూసేందుకు తారక్ ఫ్యాన్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం కచ్చితంగా మజ్నువైపే చూస్తాడు. సినిమాకు కామెడీ ప్లస్ అవ్వడం, పాటలు కూడా హిట్ అవ్వడంతో మజ్ను కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేస్తాడనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే జనతా గ్యారేజ్ ఫైనల్ రన్ లెక్కలు వచ్చే వారంతోనే ఆగిపోవడం గ్యారెంటీ.

Loading...

Leave a Reply

*