రాజ‌మౌళి ఫాద‌ర్ మ‌ళ్లీ కాపీ కొట్టాడు.. జాగ్వార్‌తో అడ్డంగా బుక్ అయ్యాడు..!

rajeyendra-prasad

రాజ‌మౌళి సినిమాల‌కి క‌థ‌, క‌థ‌నం ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర వ‌ర్మే రాస్తుంటారు ఎక్కువ‌గా. రాజ‌మౌళి టాలెంట్‌ని, గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ఆయ‌న సాధించిన విజ‌యాల‌ను, బాక్సాఫీస్ రికార్డుల‌ను కాసేపు ప‌క్క‌న పెడితే.. ఆయన ఓ పెద్ద కాపీ మాస్ట‌ర్ అనే కామెంట్స్ ఉన్నాయి. ఆయ‌న డైరెక్ట్ చేసిన తొలి చిత్రం నుంచి నేటి లేటెస్ట్ మూవీ బాహుబ‌లి వ‌ర‌కు… ప్ర‌తి సినిమాలోని ఏదో ఒక సీన్ ఏదో ఒక మూవీ నుంచి కాపీ కొట్టార‌నో, ఇన్‌స్ప‌యిర్ అయ్యార‌నో ప్ర‌చారం మాత్రం జ‌రుగుతుంటుంది.

లేటెస్ట్‌గా రాజ‌మౌళి తండ్రి.. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడ‌ని నెటిజ‌న్‌లు జోక్‌లు వేస్తున్నారు. రీసెంట్‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన జాగ్వార్ సినిమాలో హీరో ప‌గ‌, ప్ర‌తీకారం తీర్చుకునే పాయింట్‌.. బెంగాల్ టైగ‌ర్ మూవీలోని తండ్రిని చంపితే హీరో ప‌గ తీర్చుకునే ఎపిసోడ్ సేమ్ ఒకేలా ఉన్నాయ‌ట‌. జాగ్వార్ సినిమా చూస్తున్న‌ప్పుడు ఆ ఎపిసోడ్ రాగానే.. ఇదెక్క‌డో చూసిన‌ట్లుందే అని భావించార‌ట చాలామంది. ఒక్క రివైండ్ వేసుకుంటే అది ర‌వితేజ మూవీ అని గుర్తుకు వ‌చ్చింద‌ట‌. ఇంకాస్త గ‌ట్టిగా రివైండ్ చేసుకుంటే.. అది బెంగాల్ టైగ‌ర్ అని స్ట్ర‌యిక్ అయింద‌ట‌. ఇలా, జాగ్వార్ మూవీ మెయిన్ థ్రెడ్‌.. బెంగాల్ టైగ‌ర్‌ని త‌ల‌పిస్తోంద‌ట‌. దీంతో, ఇది కాపీ కొట్టారని చెబుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రం.. అలాంటిదేమీ లేద‌ని, అది ఆయ‌న సొంతంగా రాసుకున్నార‌ని, కేవ‌లం రెండు సీన్‌లు కాస్త ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని క‌వ‌ర్ చేసే ప‌నిలో పడ్డార‌ట‌.

విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. రాసిన సీన్‌లు, రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన క‌థ‌లు.. ఇలా మ‌రో మూవీలో క‌నిపించ‌డం కొత్తేమీ కాదు.. విక్ర‌మార్కుడు బెల్ట్ సీన్‌.. విజ‌య‌శాంతి ఓల్డ్ మూవీలో క‌నిపించింది. ఇక‌, ఛ‌త్ర‌ప‌తి, ఈగ సినిమాలు హాలీవుడ్ చిత్రాల‌నుంచి కాపీ కొట్టార‌నే టాక్ ఉంది. బాహుబ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ బాహుబ‌లిని నీటిలో ఒంటిచేత్తో ఎత్తే సీన్ కూడా ఓ హాలీవుడ్ పోస్ట‌ర్‌ని మ‌క్కీకి మ‌క్కీ దించేశాడ‌ని ప‌బ్లిక్‌గా చ‌ర్చ జ‌రిగింది. ఇక బాహుబ‌లి సినిమా టీజ‌ర్‌ని ఓ టెంప్లేట్‌లో పెట్టి చేశారు. అది త‌మ ఓన్ క్రియేటివిటీ అని ముందు నానా ప్ర‌చారం చేశారు. తీరా అది నెట్‌లో 20డాల‌ర్‌ల‌కే దొరికే థీమ్‌ని వాడేసుకున్నార‌ని నెట్టింట్లో హోరెత్తింది. ఏవి ఎలా ఉన్నా.. వారి సినిమాలు ఆడుతున్నాయి కాబ‌ట్టి స‌రిపోయింది.. లేదంటే విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వ‌చ్చేవి.

Loading...

Leave a Reply

*