జాగ్వార్ ఫ‌స్ట్ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..!

jagwar

భారీ వ్య‌యంతో తెర‌కెక్కిన మూవీ జాగ్వార్‌. ఓ ఇంట్ర‌డ‌క్ష‌న్ హీరోకి ఇంత‌వ‌ర‌కు ఏ రేంజ్‌లో చెయ్య‌ని విధంగా భారీగా ఖ‌ర్చు పెట్టిన తీసిన మూవీ ఇది. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌న్న‌డ మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డి కుమార‌స్వామి త‌నయుడు హీరోగా తెరంగేట్రం చేసిన మూవీ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటు, భారీ వ్యయంతోపాటు త‌మ‌న్న ఐటెం సాంగ్‌, జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్య‌కృష్ణ, రావు ర‌మేష్ వంటి సీనియ‌ర్ న‌టులు న‌టించ‌డంతో జాగ్వార్‌పై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. ఈ సినిమాకి క‌థ‌ని అందించింది రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌కి ఎన్నో వండ‌ర్‌ఫుల్ క‌థ‌ల‌ని అందించి స‌క్స‌స్ ఫుల్ స్టోరీ రైట‌ర్‌గా పేరు గాంచిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ వ‌ర్క‌వుట్ అయిందా..? జాగ్వార్‌తో హీరో నిఖిల్‌కి ఎలాంటి ఇంట్ర‌డ‌క్ష‌న్ ల‌భించింది..? ఆయ‌న స‌క్సెస్ అయ్యాడా?.? ఫెయిల‌య్యాడా..? అనేది ఇప్పుడు చూద్దాం..

మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థ న‌డుస్తోంది. మెడిక‌ల్ కాలేజ్‌లు, హాస్పిట‌ల్స్ ర‌న్ చేస్తుంటారు బ‌డా బిజినెస్ టైకూన్ షౌరీ ప్ర‌సాద్ (సంప‌త్ కుమార్‌), సోమ్ శేఖ‌ర్ (ఆదిత్య మీన‌న్‌)లు. న‌టుడు ఆద‌ర్శ్‌.. ఈ కాలేజ్‌ల‌లో ఒక‌దాంట్లో మెడిసిన్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్‌. కాలేజ్‌లోని అక్ర‌మాలు, అవినీతిపై మొద‌టినుంచి పోరాటం చేస్తుంటాడు. ఒక సంద‌ర్భంలో లోకి(అజ‌య్‌)తో పోరాడాల్సి వ‌స్తుంది. దీంతో, సినిమా క‌థ కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఇక‌, అదే కాలేజ్‌లో ఫ‌స్ట్ ఇయ‌ర్ స్టూడెంట్‌గా చేరిన కృష్ణ (హీరో నిఖిల్‌) ఈ గేమ్‌లో ఎలా ఎంట‌ర‌వుతాడు..? మెడిసిన్ మాఫియా ఆట ఎలా క‌ట్టిస్తాడు..? అనేది తెర‌పైన చూడాల్సిందే.

హీరోగా నిఖిల్ ప‌ర్లేద‌నిపించాడు. తొలి సినిమానే అయినా.. ఇప్ప‌టికే డ్యాన్స్‌, యాక్టింగ్‌, ఫైట్‌లలో శిక్ష‌ణ తీసుకోవ‌డం వ‌ల్ల కొంత‌వ‌ర‌కు మేనేజ్ చేశాడు. అయితే, ఫ‌స్ట్ మూవీ హీరోనే అయినా.. ఫుల్ లెంగ్త్ మాస్ కేర‌క్ట‌ర్‌ని ఎంచుకోవ‌డం కాస్త ఇబ్బందిగా మారిందంటున్నారు. ఎన్టీఆర్‌, బ‌న్ని వంటి బ‌డా హీరోలు కూడా చెయ్య‌డానికి సాహ‌సించే రేంజ్‌లో యాక్ష‌న్ బేస్డ్ మూవీని ఎంచుకోవ‌డం నిఖిల్ రేంజ్‌కి స‌రిపోలేద‌నే టాక్ వినిపిస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్ర‌లకంటే.. ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌తో లాంచ్ అయితే బావుండ‌ని క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. స్టంట్స్ సీన్‌లో ఎన్నో రియల్‌గా చేసినా.. కుర్రాడు క‌ష్ట‌ప‌డ్డాడు అనే భావ‌న క‌లిగించ‌డంలో స‌క్సెస్ అయ్యాడంటున్నారు. ఇక‌, డ్యాన్స్‌ల‌లోనూ నిఖిల్ ప‌ర్లేద‌నిపించాడు. త‌మ‌న్న‌తో పోటీ ప‌డి స్టెప్పులెయ్య‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ట‌.

ఇక హీరోయిన్ దీప్తిని గ్లామ‌ర‌స్‌గా చూపించారు. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ రొటీన్ పాత్ర‌ల‌లోనే ఉన్నంతలో బాగానే చేశారని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, విల‌నిజం కంటే.. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ బాగా ఆక‌ట్టుకున్నాయ‌ట‌. సినిమాలో సెకండ్ రోల్ వాళ్ల‌దే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మొత్త‌మ్మీద‌, సినిమా ఫ‌స్ట్ హాఫ్ ప‌ర్లేద‌నిపిస్తే.. సెకండాఫ్ యాక్ష‌న్ సీన్‌ల‌తో నిండిపోయింద‌ట‌. టోట‌ల్‌గా సినిమాలో ఖ‌ర్చు బాగా క‌నిపిస్తోంద‌ట కానీ, అస‌లు మేట‌ర్ మాత్రం లేద‌నే కామెంట్స్ ప‌డుతున్నాయి.

బాట‌మ్‌లైన్‌.. మ‌రో అఖిల్‌.. ఈ జాగ్వార్‌..!

Loading...

Leave a Reply

*