బాహుబలిపై ఐటీ దాడుల వెనక బడా హీరో…

untitled-1

బాహుబలి సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. తెలుగు సినిమా స్టామినాను పెంచింది. కలలో కూడా ఊహించని వసూల్లు సాధించింది. ఈ సినిమా పార్ట్-1కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వందల కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు పార్ట్-2తో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాదించాలనేది టార్గెట్. అయితే ఇంతటి భారీ సినిమాను దెబ్బకొట్టాలని టాలీవుడ్ లో ఓ సెక్షన్ ఎప్పట్నుంచో కాచుక్కూర్చుందట. ఆ సెక్షనే ఇప్పుడు బాహుబలి నిర్మాతలపై ఐటీ అధికారులు దాడులకు దిగేలా చేసిందనే వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరో ఈ దాడుల వెనక ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆ ప్రముఖ హీరోకు మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అతడు చెప్పే మాస్ డైలాగులంటే ప్రత్యేకంగా ఓ సెక్షన్ అభిమానులకు చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఓ పార్టీలో కీలకమైన వ్యక్తి కూడా కావడంతో… అతడు బాహుబలి నిర్మాతలపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో తన సినీ, రాజకీయ పలుకబడిని ఉపయోగించి నిర్మాతల ఆఫీసులపై దాడి చేయించాడని చెబుతున్నారు.మరీ ముఖ్యంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతున్న ఈ టైమ్ లో టైం చూసి దెబ్బకొట్టాడని అంటున్నారు.

ఫలితంగా బాహుబలి నిర్మాతలు 50కోట్ల రూపాయల మేర అడ్డంగా దొరికినట్టు టాక్ నడుస్తోంది.ఈమధ్య పలు వివాదాలతో ఈ బడా హీరో వార్తల్లో వ్యక్తిగా కూడా మారాడు. ఇప్పుడు ఈ దాడుల కోసం ఈ బడా హీరోకు మరో బడా హీరో కూడా సహకరించాడట. ఇద్దరూ కలిసి బాహుబలి నిర్మాతలపై దెబ్బేశారని టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. ఆ బడా హీరోలకు ఇండస్ట్రీలో మంచి పట్టు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ… బాహుబలి నిర్మాతలతో వాళ్లకు ఎక్కడ చెడిందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Loading...

Leave a Reply

*