బిగ్ బ్రేకింగ్‌.. బాహుబ‌లి నిర్మాత‌ల‌పై ఐటీ దాడులు…!

untitled-15

టాలీవుడ్‌కి మ‌రో షాకింగ్ న్యూస్‌. అస‌లే నోట్ల ర‌ద్దుతో విల‌విల‌లాడుతున్న తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌పై ఐటీ ఫోక‌స్ కూడా ప‌డిన‌ట్లుంది. తాజాగా బాహుబ‌లి నిర్మాత‌ల ఇళ్లు, ఆఫీస్‌ల‌పై ఒక్క‌సారిగా ఐటీ అధికారులు విరుచుకుప‌డ్డారు. సోదాలు నిర్వ‌హించారు. ప‌లు కీల‌క డాక్యుమెంట్‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.బాహుబ‌లిపై భారీ బెట్టింగ్ న‌డుస్తోంది. ఈ సినిమాని దాదాపు 400 కోట్ల‌కు మార్కెట్ చెయ్యాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే నైజాం ఏరియాని 50 కోట్ల‌కు ఒక‌రు కొనుగోలు చేశారు. అటు, ఓవ‌ర్సీస్ మార్కెట్‌లోనూ రికార్డ్ ధ‌ర‌కు హ‌క్కుల‌ని ద‌క్కించుకున్నారు. బాలీవుడ్‌లో ఈ మూవీ శాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా 53 కోట్లు చెల్లించ‌డానికి ఓ చానెల్ ముందుకు వ‌చ్చింది. ఇక‌, త‌మిళ్‌, మ‌ల‌యాళీ, హిందీ, క‌ర్నాట‌క‌తోపాటు రెస్టాఫ్ ఇండియా బిజినెస్ కూడా మిగిలే ఉంది. అన్నీ క‌లుపుకుంటే దాదాపు 360-400 కోట్ల మేర బెట్టింగ్ జ‌ర‌గొచ్చ‌ని స‌మాచారం.

తాజాగా నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంతో పాత బ్లాక్‌మ‌నీని కూడా వైట్ చేసుకోవాల‌ని బాహుబ‌లి టీమ్ ప‌క్కా స్కెచ్ వేసిన‌ట్లు, అది ఐటీ అధికారుల‌కు లీక్ అయిన‌ట్లు స‌మాచారం. అందుకే, ఊహించ‌ని విధంగా ఐటీ రెయిడ్స్ నిర్వ‌హించార‌ట అధికారులు. నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఇళ్లు, ఆఫీస్‌ల‌పై ఏక‌కాలంలో దాడులు నిర్వహించారు. అధికారులు కొన్ని కీల‌క డాక్యుమెంట్‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రి, ఈ కేసు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*