బాహుబ‌లి నిర్మాత‌ల ద‌గ్గ‌ర అంత మ‌నీ బ‌య‌ట‌ప‌డిందా.. ఐటీ శాఖ షాక్‌…!

baahubali

బాహుబ‌లి నిర్మాత‌ల‌పై ఐటీ శాఖ రెయిడ్స్‌.. టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. రెండో రోజు కూడా ఈ సినిమా నిర్మాత‌ల ఇళ్లు, ఆఫీస్ కార్యాల‌యాల‌పై సోదాలు జ‌రిగాయి. ఇటు, డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌పైనా ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు అధికారులు. ఈ రెయిడ్స్ వెనుక ఉన్న‌ది ఓ డిస్ట్రిబ్యూట‌ర్ అని స‌మాచారం.

ముంబైకి చెందిన డిస్ట్రిబ్యూట‌ర్‌.. అగ‌ర్వాల్‌… 500, 1000రూపాయ‌ల నోట్ల ర‌ద్దుతో కంగారు ప‌డ్డాడ‌ట‌. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వ‌ర్క‌ర్‌లు, ఆఫీస్ స్టాఫ్‌కి ఒక్కొక్క‌రికి 2.5 ల‌క్ష‌లు ఇచ్చి అకౌంట్‌లో వెయ్య‌మ‌ని జ‌మ చేయించాడ‌ట‌. ఆ త‌ర్వాత వారి నుంచి చెక్కుల రూపంలో పుచ్చుకొని వైట్ మ‌నీగా మార్చుకున్నాడ‌ట‌. ఈ తతంగం అంతా రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే జ‌ర‌గ‌డంతో ఐటీ అధికారుల‌కు ఉప్పు అందింద‌ట‌. అంతే, ఆ డిస్ట్రిబ్యూట‌ర్‌పై రెయిడ్స్ నిర్వ‌హించ‌గా ఆయ‌న బాహుబ‌లి పంపిణీదారుడు అని తేలడంతో.. ఐటీ అధికారుల ఫోక‌స్ వెంట‌నే వీరిపై ప‌డింది. అందుకే, ఏక‌కాలంలో నిర్మాత‌ల ఇళ్ల‌పై దాడులు చేశారు. తాజాగా జిల్లాల్లోని పంపిణీదారుల‌పైనా రెయిడ్స్ చెయ్య‌డం విశేషం

ఈ దాడుల్లో బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ కార్యాలయాలు సహా హైదరాబాద్‌లో ఆరు చోట్ల, ముంబై, బెంగళూరుల్లో 9 చోట్ల సోదా చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రికి రూ.55 కోట్ల దాకా నగదు బయటపడినట్లు తేలింది. బాహుబలి లావాదేవీల్లో చాలావరకు నగదులోనే జరగడంతో అదంతా బ్లాక్‌మనీగానే వారు భావిస్తున్నట్టు సమాచారం. కానీ.. అది వైట్‌ మనీయేనని.. తమ సినిమాకు సంబంధించి అన్ని చెల్లింపులూ పద్ధతి ప్రకారమే చేస్తున్నామని బాహుబలి బృందం ఐటీ అధికారుల ముందు వాదించినట్లు తెలిసింది. అయితే అందుకు ప‌క్కా ఆధారాలు చూపించుకోవాల్సిన అవ‌స‌రం బాహుబ‌లి నిర్మాత‌ల ముందు ఉంది.

Loading...

Leave a Reply

*