ఇజం హిట్టా.. ఫ‌ట్టా.. క‌లెక్ష‌న్‌ల టాక్ ఏంటి..?

kalyan
క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ మూవీ ఇజం. అంతేకాదు, పూరి జ‌గన్నాధ్ వంటి బ‌డా డైరెక్ట‌ర్‌తో ఈ నంద‌మూరి హీరో న‌టించ‌డం కూడా ఇదే తొలిసారి. అందుకే, ఈ సినిమాపై న‌మ్మ‌కంతో ఇజంపై భారీగా ఇన్వెస్ట్ చేశాడు క‌ల్యాణ్‌రామ్‌. త‌న మార్కెట్ స్టామినాని మించి ఖ‌ర్చు పెట్టాడు. దాదాపు 26 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ అయింది ఇజం కోసం. గత వీకెండ్ కానుక‌గా వ‌చ్చిన ఇజం.. ఫ‌స్ట్ వీకెండ్‌కి 5కోట్ల‌కుపైగా కలెక్ట్ చేసింది. క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఇవి భారీ ఓపెనింగ్స్‌. తొలి రోజు 3 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కి 4 కోట్ల‌కుపైగానే వ‌సూళ్లు పొందింది. తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఓవ‌ర్సీస్‌లోనూ క‌లిపి సాధించిన వ‌సూళ్లు ఇవి.
క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ అయినా.. సినిమా లాంగ్ ర‌న్‌లో ఇది ఎంత‌వ‌ర‌కు కలెక్ట్ చేస్తుంద‌నేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాపై 26 కోట్ల బ‌డ్జెట్ పెట్టారు. శాటిలైట్ రైట్స్ 6 కోట్లు ప‌లికింద‌నే టాక్ వినిపిస్తోంది. అంటే బాక్సాఫీస్‌ద‌గ్గ‌ర ఇజం మినిమ‌మ్ 20 కోట్లు సాధించాలి. అప్పుడే బ‌య్య‌ర్లు రిక‌వ‌ర్ అయ్యేది. తొలి మూడు రోజుల‌కే 7 కోట్ల‌కుపైగా షేర్‌ క‌లెక్ట్ చేసిన ఇజం లాంగ్ ర‌న్‌లో ఏమేర‌కు వ‌సూళ్లు సాధిస్తుంద‌నేది చూడాలి. సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది.
నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఆడియెన్స్‌కి కూడా పూరి జ‌గ‌న్నాథ్ ట్రీట్‌మెంట్‌, నారేష‌న్‌తోపాటు క‌ల్యాణ్‌రామ్ న్యూ లుక్‌, మేకోవ‌ర్, బాడీ లాంగ్వేజ్ బావున్నాయంటున్నారు. మ‌రోవైపు, ఈ వీకెండ్‌లో దీపావ‌ళి కూడా ఉంది. ఇది కూడా ఇజంకి క‌లిసొచ్చే అంశం. సినిమాని దాదాపు 6 కోట్ల లాస్‌తో క‌ల్యాణ్‌రామ్ రిలీజ్ చేశాడ‌నే టాక్ ఉంది. మ‌రి, ఇజంతో క‌ల్యాణ్‌రామ్ గ‌ట్టెక్కుతాడా?  లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.
Loading...

Leave a Reply

*