ఇజమ్ టైటిల్ సాంగ్ కిర్రాక్…

isam

కొన్ని సాంగ్స్ అంతే. వినగానే ఇట్టే కిక్కెక్కిస్తాయి. పైగా ఆ పాటల్లో కొన్ని బూతులు కూడా యాడ్ అయితే ఇప్పుడు ఈజీగా కుర్రాళ్లకు కనెక్ట్ అయిపోతోంది. చెప్పుకోవడానికి కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇజంతో ఈ నిజం మరోసారి ప్రూవ్ అయింది. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ పూరి స్టయిల్ లో సాగుతుంది. సాగడమేంటి.. ఆ పాట రాసిందే పూరి జగన్నాధ్. రాయడం ఏంటి.. ఏకంగా ఆ పాటను తన స్టయిల్ లో పాడేశాడు కూడా. అసలు పూరీ పాట పాడుతున్నాడా.. లేక మాటలు చెబుతున్నాడా… ఇవేవీ కాకుండా బూతులు తిడున్నాడా అనే విధంగా ఉంటుంది ఇజమ్ లోని టైటిల్ సాంగ్. అది ఎలా ఉంటేనేం.. పాట మాత్రం కనెక్ట్ అయిపోయింది. యూట్యూబ్ లో పాటను వినడంతోనే సరిపెట్టుకోకుండా.. వాట్సాప్ లో గ్రూప్ మెసేజింగ్ లు, ఫేస్ బుక్ లో షేరింగ్ ల వరకు ఆ పాట వెళ్లిపోయింది.

దీంతో ఇజమ్ టైటిల్ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయిపోయింది.ఈ టైటిల్ సాంగ్ ఎలా అయితే ఇనిస్టెంట్ గా హిట్ అయిందో… సినిమాలో ఓ కోర్టు సీన్ కూడా అంతే ఇనిస్టెంట్ గా హిట్ అవుతుందంటున్నాడు పూరి జగన్. ఇది సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని, ఇందులో మంచి సోషల్ మెసేజ్ ఉందని అంటున్నాడు. గతంలో కూడా పూరి తారక్ తో చేసిన టెంపర్ చిత్రంలోని కోర్ట్ సీన్ బాగా పాపులర్ అయింది. సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఇప్పుడు ఇజమ్ లో కూడా అదే ఫార్ములా వర్కవుట్ అవుతుందా అనేది చూడాలి. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ ప్రధాన పాత్రలో నటించాడు.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్ గా నటించింది.

Loading...

Leave a Reply

*