ఫేస్‌బుక్ లైవ్ చాట్ 8.18పీఎం.. ఇదీ చెర్రీ-సుకుమార్‌ టైటిల్…!

untitled-11

రామ్‌చ‌ర‌ణ్‌-సుకుమార్ సినిమాపై కొత్త అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ టాలీవుడ్‌లో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఫేస్‌బుక్ లైవ్ చాట్ 8.18 పీఎమ్‌.. వినడానికే ఇంట‌రెస్టింగ్‌గా ఉంది క‌దూ ఈ టైటిల్‌.. ప్రి ప్రొడ‌క్షన్ ద‌శ‌లోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. హీరోల‌ను కొత్త‌గా చూపించ‌డం, స్ట‌యిలిష్‌గా ప్రెజెంట్ చెయ్య‌డంతోపాటు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో ఆయ‌నది డిఫ‌రెంట్ స్ట‌యిల్‌.

ఇప్ప‌టికే ఈ టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేయించే ప‌నిలో సుకుమార్ ఉన్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. ప్రస్తుతం యువత ఆలోచ‌న‌లు, వారి సామాజిక పోక‌డ‌ల‌పైనే సుకుమార్ ఈ సినిమా క‌థ‌ని రాసుకున్నాడ‌ట‌. ప్ర‌తి సినిమాకి క‌థ‌, క‌థ‌నాన్ని కొత్త‌గా తీసుకునే సుకుమార్‌.. చెర్రీ కోసం అదిరిపోయే స్టోరీ లైన్‌ని సిద్ధం చేశాడ‌ట‌. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీకి కూడా క‌థ‌ని చెప్పాడ‌ని, వారు కూడా ఫుల్ కాన్‌ఫిడెంట్‌గా ఉన్నార‌ని చెబుతున్నారు.

అయితే, టైటిల్‌పై సుకుమార్ కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. టైటిల్ బీ, సీ సెంట‌ర్ ఆడియెన్స్‌కు రీచ్ అవుతుందా? లేదా? అనే దానిపైనే సుక్కు హైరానా ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ ఒక్క విష‌యం మిన‌హా.. మిగ‌తా అంతా ఓకేన‌ట‌. ఫేస్‌బుక్ లైవ్ చాట్ 8.18 పీఎం అనే టైటిల్‌, క‌థ‌కి ప‌క్కాగా సెట్ అయ్యేలా ఉంద‌ని భావిస్తున్నారు. సుమారు 60 కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ట ఈ మూవీ. టైటిల్‌పై త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకుంటార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

 

Loading...

Leave a Reply

*