ఎన్టీఆర్ ఆస్తి విలువ ఎన్ని వేల కోట్లంటే…?

ntr

తార‌క్‌… నంద‌మూరి వంశంలో మూడోత‌రం వార‌సుడు.. తాత నుంచి పోలిక‌లు, న‌ట‌న వ‌చ్చాయి. తండ్రి నుంచి పౌరుషం ఆవేశం అందుకున్నాడు. ఆయ‌న‌కు ఆస్తి ప‌రంగా కూడా బాగానే క‌లిసి వచ్చింది. తాత ఎన్టీఆర్.. త‌న వార‌సుల‌కు ఒక్కొక్క‌రికి 90ల‌లోనే వంద‌ల కోట్లు పంచి పెట్టార‌నే వాద‌న‌లు ఉన్నాయి. ఇలా, హ‌రికృష్ణ‌కు తండ్రి ద‌గ్గ‌రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తి.. 200 కోట్ల‌కుపైగానే ఉంటుందట‌. దానిని హ‌రికృష్ణ సుమారు 1800 కోట్ల‌కు పెంచాడ‌ట‌. ఇటు, నాటి ఆస్తులలో ఎక్కువ‌గా భూమి ఉండ‌డం కూడా క‌లిసి వ‌చ్చింద‌ని చెబుతారు. అది ఇప్పుడు వంద‌ల కోట్ల విలువు చేస్తుంద‌ని.. ఇలా అది సుమారు 2 వేల కోట్ల దాకా అయింద‌ని వినికిడి.

అలా హ‌రికృష్ణ ద‌గ్గ‌ర‌నుంచి తార‌క్‌కి వ‌చ్చిన ఆస్తి విలువ సుమారు 7వంద‌ల కోట్ల‌కుపైమాటే అని చెబుతారు. అంటే ఇది కేవ‌లం మార్కెట్ విలువ మాత్ర‌మే సుమా. దానిని తార‌క్ బాగానే కూడ‌దీశాడ‌ని.. అది ఎప్పుడో కొన్నేళ్ల క్రిత‌మే కొంత ఆస్తిని తార‌క్‌కి అప్ప‌జెప్పగా.. ఆయ‌న దానిని బాగానే మ‌రింత మార్కెట్ విలువ జోడించి.. వెయ్యి కోట్ల‌కుపైగానే చేర్చాడ‌నే టాక్ ఉంది.

ఇటు, భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి రూపంలోనే ఆయ‌న‌కు ఆస్తి బాగానే క‌లిసి వ‌చ్చింద‌ని చెబుతారు. ఆమె తండ్రి నార్నె శ్రీనివాసరావు రియ‌ల్ ఎస్టేట్‌లో బాగానే సంపాదించారని, అంత‌కుముందు చంద్ర‌బాబు సీఎమ్‌గా ఉన్న టైమ్‌లో నార్నె శ్రీనివాస‌రావు ప‌లుకుబ‌డి బాగా ఉండేద‌ని అంటారు. ఇలా ఆయ‌న ద‌గ్గ‌ర‌నుంచి ల‌క్ష్మీ ప్ర‌ణతికి సుమారు 6-7 వంద‌ల కోట్ల ఆస్లులు వివిధ రూపాయ‌ల‌లో వ‌చ్చాయ‌ని చెబుతారు. వీటికితోడు ఏటా తార‌క్ త‌న సినిమాల రెమ్యూన‌రేష‌న్ రూపంలోనూ బాగానే వెనుకేస్తున్నాడ‌ని..ఇలా అన్ని ఆస్తులు క‌లిపితే.. తార‌క్ సుమారు 3వేల కోట్ల‌కు అధిప‌తి అని సినీ జనాల్లో కొంద‌రు నోటిమాట‌గా చెబుతారు. ఇందులో నిజ‌మెంత అనేది పెరుమాళ్ల‌కే ఎరుక‌.

Loading...

Leave a Reply

*