నంద‌మూరి బ్ర‌ద‌ర్స్‌కి రామోజీ అండ‌.. దండ‌..!

ramoji

రామౌజీ రావు.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగు మీడియారంగంలో తిరుగులేని వ్య‌క్తి. ఇటు రాజ‌కీయాల‌లో అయినా, అటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అయినా ఒక‌రికి ఆయ‌న అభ‌య‌హస్తం ఇచ్చారంటే చాలు.. త‌డిగుడ్డ వేసుకోకుండానే నిద్ర‌పోవ‌చ్చు. అదీ ఆయ‌న ప‌వ‌ర్‌. అలాంటి రామోజీరావు.. ఇటీవ‌ల నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ అదేనండి.. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌కి సాయం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. వీరికి ఆయ‌న అండ‌దండ‌లు ఇస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.నిన్న ఈనాడు పేప‌ర్‌లో క‌ల్యాణ్‌రామ్ లేటెస్ట్ మూవీ ఇజం యాడ్ వ‌చ్చింది. ఇలా ఈనాడు న్యూస్ పేప‌ర్‌లో ఓ సినిమా యాడ్ రావ‌డం దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత ఇదే ఫ‌స్ట్ టైమ్‌. గ‌తంలో చిత్ర నిర్మాత‌ల మండ‌లి విధించిన బ్యాన్ ప్ర‌కారం ఈనాడు టీవీలో యాడ్స్ వ‌స్తున్నా..

పేప‌ర్‌లో మాత్రం సినిమా ప్ర‌క‌ట‌న‌లేవీ ప్ర‌చురితం కావ‌డం లేదు. ఈనాడే స్వ‌యంగా వాటిని తిర‌స్క‌రిస్తోంద‌న్న వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి. అలాంటిది నిన్న ఆదివారం ఏకంగా ఈనాడు మెయిన్ ఎడిష‌న్ సెకండ్ పేప‌ర్‌లోనే ఇజం యాడ్ క‌నిపించ‌డం విశేషం. ఇలా నంద‌మూరి హీరో కోసం ఏకంగా నిబంధ‌న‌లను సైతం రామోజీ గ్రూప్ ప‌క్క‌న పెట్టింద‌నే కామెంట్స్ వస్తున్నాయి. ఈనాడులాంటి ప‌త్రిక ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం కేవ‌లంతోనే నందమూరి హీరోతోనే షురూ అయిందంటున్నారు మ‌రికొంద‌రు.మ‌రోవైపు, ఈ ఏడాది స్టార్టింగ్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌పై ఏకంగా ఈనాడు సండే మేగ‌జైన్‌లో మెయిన్ స్టోరీ రాసింది.

అంటే దాదాపు అది ఏడెనిమిది పేజీల వార్త‌. బాహుబ‌లి త‌ర్వాత మ‌రో హీరో సినిమాకి ఈనాడు ఈ రేంజ్‌లో సండే మేగ‌జైన్‌లో స్టోరీ రాయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయింది. బాహుబ‌లి వేరు. దాని స్టామినా, పొటెన్షియాలిటీ అంతా డిఫ‌రెంట్‌. కానీ, తార‌క్ లాంటి హీరో కోసం ఈనాడు అంతటి పెద్ద ఆర్టిక‌ల్‌ని రాయ‌డం మాత్రం సెన్సేష‌న్ అయింది. అయితే, ఎన్టీఆర్‌ని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేసింది ఆయ‌నే. నిన్ను చూడాల‌ని మూవీతో తార‌క్ తెరంగేట్రం చేశాడు.

ఈ సినిమాకి రామోజీరావే నిర్మాత‌.సండే మేగ‌జైన్‌పై తార‌క్‌ని క‌వ‌ర్ చేసి నంద‌మూరి అభిమానుల‌ను ఖుషీ చేసిన తార‌క్‌.. తాజాగా క‌ల్యాణ్‌రామ్ విష‌యంలో మ‌రో షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు. అదే ఈనాడు పేప‌ర్‌లో సినిమా ప్ర‌మోష‌న్ యాడ్‌. ఇలా, నంద‌మూరి హీరోల‌కి సర్‌ప్రైజ్‌ల‌తో ముంచెత్తుతున్నాడు రామోజీరావు. అందుకే, కొంద‌రు ఈ నంద‌మూరి బ్ర‌ద‌ర్స్‌కి రామోజీరావు అండదండ ఇస్తున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్త‌వ‌మెంతో వారికే ఎరుక‌.

Loading...

Leave a Reply

*