హైప‌ర్‌పై న‌యా రూమ‌ర్‌.. రామ్ షాక్‌..!

is-ram-hyper-going-to-postpone

ప్రస్తుతం రామ్ సినిమాపై అందరికీ ఉన్న డౌట్ ఇదే. ఓవైపు సాంగ్స్ రిలీజ్ చేస్తున్నప్పటికీ.. మరోవైపు ప్రమోషన్ షురూ చేసినప్పటికీ… సినిమా ఇంకా సెన్సార్ పూర్తికాలేదు. అంటే ఫస్ట్ కాపీ రెడీ అవ్వలేదన్నమాట. మరోవైపు ఈ శుక్రవారమే థియేటర్లలోకి హైపర్ వస్తుందంటూ మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వార్తలు మాత్రం ఇంకో వారం రోజులు హైపర్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయంటూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కు తెరపడింది.

రామ్ హీరోగా నటిస్తున్న హైపర్ సినిమా ఎట్టిపరిస్థితుల్లో ఈనెల 30కే థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలే వెల్లడించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట.. ఈ మేటర్ పై ట్వీట్ చేశాడు. తమ సినిమా 30కే వస్తుందని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దని క్లారిటీ ఇచ్చాడు. ప్రమోషన్ ను దర్శకుడు, హీరో చూసుకుంటారని.. మార్కెట్-డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్ని నిర్మాతలు చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు.

లో ఫస్ట్ కాపీ సిద్ధంచేసి,సెన్సార్ పూర్తిచేసి, ప్రమోషన్ చేసి సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి.. మిగిలిన ఈ 5 రోజుల టైం సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల ప్రచారానికి టైం సరిపోదని.. ఆఖరి నిమిషంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని చాలామంది భావిస్తున్నారు. వెబ్ మీడియాలో కూాడా ఓ రేంజ్ లో ప్రమోషన్ జరిగినప్పుడు మాత్రమే సినిమాకు ప్లస్ అవుతుంది. ఆ విషయం ఈమధ్య కాలంలో ప్రూవ్ అయింది కూడా. హైపర్ మేకర్స్ మాత్రం ఈ యాంగిల్ ను లైట్ తీసుకున్నట్టుున్నారు. అయితే, హైప‌ర్ పోస్ట్‌పోన్ అవుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోందట‌. దీంతో, రామ్‌.. షాక్ అయ్యాడ‌ట‌. మ‌రి, హైప‌ర్ నిజంగానే వాయిదా ప‌డుతుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*