పూరికి ఎన్టీఆర్ షాక్‌.. సినిమా నుంచి ఔట్‌..!

puri-and-ntr

పూరి జ‌గ‌న్నాథ్‌కి తార‌క్ షాక్ ఇస్తున్నాడా..? త‌్వర‌లో ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో ఓ మూవీ చెయ్య‌డానికి తార‌క్ రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఆయ‌న ఎంతోమంది ద‌ర్శ‌కుల కోసం నిరీక్షించాడు. ఇటు త్రివిక్ర‌మ్‌, అటు తమిళ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితోనూ ఓ మూవీకి క‌మిట్ అవుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆ రెండు సినిమాలు సైడ్ అయిపోయాయి. దీంతో, ఆయ‌న చివ‌రి వ‌ర‌కు నిరీక్షించి పూరితో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌నే రూమర్ వ‌చ్చింది. త్వర‌లోనే ఇది సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌నే టాక్ కూడా న‌డిచింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. తార‌క్ పూరికి హ్యాండ్ ఇచ్చాడ‌ని, ఆయ‌న డైరెక్ష‌న్‌లో సినిమా చెయ్య‌డంలో డైల‌మాలో ప‌డిపోయాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ల్యాణ్‌రామ్‌-పూరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఇజం చిత్రం.. ఆశించిన రేంజ్‌లో ఆడ‌క‌పోవ‌డమే దీనికి కార‌ణ‌మ‌ట‌. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఇజం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ కాలేక‌పోయింది. దీనికితోడు, క‌థ బాగానే ఉన్నా.. క‌థ‌నంలో స్పార్క్ మిస్ అవ‌డం, ట్రీట్‌మెంట్‌, నారేష‌న్‌లో కొత్త‌ద‌నం లేవ‌నే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. దీంతో యంగ్‌టైగ‌ర్ ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాడ‌ని ఫిలిం న‌గర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్‌తో తార‌క్ రేంజ్ బాగా పెరిగింది. సింహాద్రి త‌ర్వాత ఆయ‌న‌కు ఆ రేంజ్ సక్సెస్‌ని క‌ట్ట‌బెట్టింది ఈ చిత్రం. దీంతో, తార‌క్‌కి ఇప్పుడు ఓ బ‌డా డైరెక్ట‌ర్ కావాలి. త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ వంటి ద‌ర్శ‌కులతో అయితే ఆయ‌న మ‌రోసారి స‌త్తా చాట‌గ‌ల‌డు. కానీ, ఆ ఇద్ద‌రు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటు, అనిల్ రావిపూడి వంటి డైరెక్ట‌ర్‌లు లైన్‌లో ఉన్నా.. వారికి స్టార్‌డ‌మ్ లేదు. ఇక‌, బోయపాటి కూడా అప్‌క‌మింగ్ హీరో అల్లుడు శీను మూవీతో బిజీగా ఉన్నాడు. దీంతో, పూరికి తార‌క్ ప‌చ్చ‌జెండా ఊపాడ‌నే టాక్ నడిచింది. అయితే, ఇజం విడుద‌ల త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ ఆలోచ‌న‌లు మారిపోయాయ‌ని, ఆయ‌న మ‌రో డైరెక్ట‌ర్‌ని వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజ‌మెంత అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది..

Loading...

Leave a Reply

*